మూడు వారాల గరిష్టం
ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్ సూచీలు శుక్రవారం మూడు వారాల గరిష్టస్థాయి వద్ద ముగి సాయి. ఐటీ షేర్ల నేతృత్వంలో సెన్సెక్స్ 119 పాయింట్లు ర్యాలీ జరిపి 21,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు ఎగిసి 6,314 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ 10 తర్వాత సూచీలు ఇంత గరిష్టస్థాయిలో ముగి యడం ఇదే ప్రధమం. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తగ్గిందన్న వార్తలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఒరాకిల్‌లు 1-3 శాతం మధ్య పెరిగాయి.
ఐటీ షేర్లలో లాంగ్ బిల్డప్
అమెరికాలో టెక్నాలజీ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఇక్కడ కూడా ఐటీ షేర్లు కొత్త గరిష్టస్థాయిల్ని చేరుతున్నందున, ఇన్వెస్టర్లు ఈ రంగంపై మొగ్గుచూపుతున్నట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఐటీ కౌంటర్లు...ముఖ్యంగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్ ఫ్యూచర్లలో తాజాగా లాంగ్ బిల్డప్ జరిగింది. ఇన్ఫోసిస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.33 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 32.59 లక్షలకు చేరింది. టీసీఎస్ ఫ్యూచర్ ఓఐలో 3.05 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 53.24 షేర్లకు పెరిగింది. ఇన్వెస్టర్లలో బుల్లిష్‌నెస్‌ను సూచిస్తూ ఈ రెండు ఫ్యూచర్లూ స్పాట్ ధరతో పోలిస్తే 1 శాతం అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్ రూ. 3,600 స్ట్రయిక్ వద్ద, టీసీఎస్ రూ. 2,200 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కూడా అంతంతమాత్రంగానే వుంది. వచ్చే కొద్దిరోజుల్లో ఈ షేర్లు మరింత పెరగవచ్చని ఈ డేటా విశ్లేషిస్తున్నది.