ఎన్‌జీటీలో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : పాత డీజిల్ వాహనాలపై నిషేధంపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. పదేండ్లు దాటిన డీజిల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కొట్టివేసింది. డీజిల్ వాహనాల కాలుష్యం ప్రజల పాటి ప్రమాదకరంగామారిందని పేర్కొంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిషేధ ఆజ్ఞలను సవరిండానికి నిరాకరించిన ఒక డీజిల్ వాహనం 24 పెట్రోల్ వాహనాలు, 40 సిఎన్‌జీ వాహనాలకు సమానం అవుతుందని వ్యాఖ్యానించింది.
కాగా నవంబర్ 2014 లో, జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున 15 ఏళ్ల కంటే ఎక్కువ డీజిల్, పెట్రోల్ వాహనాలకు అనమతి లేదని ఎన్‌జీటీ ఆదేశించింది. ఆ తరువాత ఏప్రిల్, 2015 లో ట్రిబ్యునల్ మరోసారి డీజిల్ వాహనాలను 10 ఏళ్ళకు పైబడిన డీజిల్ వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఎన్‌జీటీ మరోసారి ఆదేశించింది. జనవరి, 2017 లో ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిధిని 15 ఏండ్లకు పెంచాలని కోరింది. ఎన్‌జీటీ నిర్ణయంతో పబ్లిక్, ప్రయివేటు సెక్టార్లు తీవ్రంగా దెబ్బ తింటాయని కేంద్రం వాదిస్తోంది. అటు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రక్రియను ఢిల్లీ ఆర్‌టీఓ గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన అసంగతి తెలిసిందే.