
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు
రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల మంజూరును సవాలు చేస్తూ మాజీ ఐఏఎస్
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల మంజూరును సవాలు చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్ శర్మ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా పర్యావరణ అనుమతులు లోపభూయిష్టంగా ఇచ్చారని, పారదర్శకత పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి, పర్యావ రణ మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర పర్యావరణ అథారిటీకి నోటీసులు జారీచేస్తూ విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.