‘ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం’ | Delhi government free transport facility for public on five days | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

Nov 10 2017 3:44 PM | Updated on Nov 10 2017 3:50 PM

Delhi government free transport facility for public on five days - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో...కాలుష్య నియంత్రణపై అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సరి, బేసి విధానం అమలు కాలంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు అనగా నవంబర్‌ 17 వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది. ఉచిత ప్రయాణం విషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ ధ్రువీకరించారు. ఈ విధానం వల్ల పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించినట్లు అవుతుందని ట్విట్‌ చేశారు.

కాగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు అదనంగా మరో 600 బస్సులను అద్దెకు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అధికారిక ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలో సరి-బేసి విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే  పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్‌ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది.

మరోవైపు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ...కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. సరి-బేసి విధానాన్ని పిక్నిక్‌లా వాడుకుంటున్నారని మండిపడింది. ఈ విధానం అమలు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు నివేదిక ఇచ్చిందని, అయినా ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎన్‌టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement