'డీజిల్ కార్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దు'
న్యూఢిల్లీ: కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా డీజిల్ వాహనాలను అనుమతించొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్ జీటీ) సూచించింది. డీజిల్ వాహనాలకు రిజిస్టేషన్లు చేయొద్దని ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం డీజిల్ వాహనాలు కొనొద్దని ఆదేశించింది.
కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న సరి-బేసి సంఖ్య పాలసీపై పలు ప్రశ్నలు సంధించింది. ఈ విధానంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. వాహనాలకు అమలు చేయాలనుకుంటున్న సరి-బేసి సంఖ్యా విధానం.. ఒక్కొక్కరూ రెండేసి కార్లు కోనేందుకు పురికొల్పేలా ఉందని ఎన్ జీటీ వ్యాఖ్యానించింది.