
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన అభ్యంతరాలను విచారిస్తోన్న జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ).. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కేసు నుంచి తెలంగాణను తొలగించాలనే అంశంపై ఏపీ పిల్లిమొగ్గలు వేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు.
‘కేసు నుంచి తెలంగాణను తొలగించాలంటూ వేసిన అప్లికేషన్‌ను ఉపసంహరించుకుంటారా? కొనసాగించమంటారా?’’ అని ధర్మాసనం ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం ‘ఉపసంహరించుకుంటాం’ అని బదులిచ్చింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘అంటే, ఏదో ఒక రకంగా కేసును జాప్యం చేయాలనుకుంటున్నారా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విచారణను రేపటికి వాయిదావేశారు.
మరో పిటిషన్ వేసిన తెలంగాణ : పోలవరం ప్రాజెక్టు... పర్యావరణంపై చూపబోయే ప్రభావాన్ని అధ్యయనం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో మరో పిటిషన్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment