రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. ఎన్జీటీ తీరు సరికాదు: సుప్రీం | Supreme Court Objected NGT Stay On Rushikonda Tourism Project | Sakshi
Sakshi News home page

రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. ఎన్జీటీ తీరు సరికాదు: సుప్రీం

Published Tue, May 31 2022 1:32 PM | Last Updated on Tue, May 31 2022 7:57 PM

Supreme Court Objected NGT Stay On Rushikonda Tourism Project - Sakshi

సాక్షి, ఢిల్లీ: రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు దాఖలైన ఓ పిటిష్‌పై మంగళవారం వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఎంపీ రఘురామకృష్ణ లేఖ ఆధారంగా ప్రాజెక్టుపై స్టే ఉత్తర్వులిచ్చింది ఎన్జీటీ. అయితే ఏకపక్షంగా ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది సుప్రీం కోర్టు. 

ఇక ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు సీనియర్‌ అడ్వొకేట్‌ సింఘ్వి. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతోందని, రూ. 180 కోట్లు పెట్టబడులు ఏపీ ప్రభుత్వం పెట్టిందని కోర్టుకు తెలిపారాయన. ఓ ఎంపీ లేఖపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో ఎన్జీటీ తీరును తప్పుబట్టిన సుప్రీం.. విచారణ రేపటికి(బుధవారం) వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement