
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. ప్రాజెక్టు నిర్మాణంపై తమ వద్ద దాఖలైన పిటిషన్లను సమాంతరంగా విచారించడం సరికాదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు సమర్పించింది. వీటిని ఎన్జీటీ పరిశీలించింది.
పర్యావరణ అనుమతు లపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతున్నం దున.. ఎన్జీటీ సమాంతరంగా విచారించడం సరికాదని అభిప్రాయపడింది. మంగళ వారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment