కేటీఆర్‌కు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు | NGT Issued Notice To Ktr On His Alleged Illegal Farm House Construction | Sakshi
Sakshi News home page

వివాదాస్పద ఫాంహౌస్‌పై నిజ నిర్ధారణ కమిటీ

Published Fri, Jun 5 2020 1:15 PM | Last Updated on Fri, Jun 5 2020 1:16 PM

NGT Issued Notice To Ktr On His Alleged Illegal Farm House Construction - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జీవో 111కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్‌ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మిస్తున్నారని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ చెన్నై ధర్మాసనం కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణాలను పరిశీలించి ఇవి సక్రమమా కాదా తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్ర పర్యావరణ రిజిస్ర్టీ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2018లో 111 జీఓ కేసు విషయంలో ఎన్‌జీటీ ఆదేశాలను యథాతథంగా అమలుచేస్తున్నారా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోరింది.

చదవండి : ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్.. ఈజీ జర్నీ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement