పెరుగుతున్న కాలుష్యంపై ఎన్‌జీటీ సీరియస్
ఢిల్లీ: దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య తగ్గింపుకై చేపడుతున్న చర్యల పట్ల ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేళ్లకు మించిన వాహనాలను నిలిపివేసి.. కాలుష్య నియంత్రణకు సమగ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శులకు ఎన్‌జీసీ సమన్లు జారీ చేసింది. పొల్యుషన్ కంట్రోల్‌పై నవంబర్ 8లోగా రిపోర్ట్ సమర్పించాలని వీరిని ఆదేశించింది.