సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులను అధికారికంగా వెబ్‌సైట్‌లో ఎప్పుడు పొందుపరిచారన్న విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు మంజూరు చేసిన అనుమతులు చెల్లవంటూ హాయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ బుధవారం విచారించింది. అనుమతులు మంజూరైన అనంతరం పిటిషనర్లు 22 రోజులు ఆలస్యంగా కేసు దాఖలు చేశారు. దీంతో కేసు విచారణార్హతపై ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment