పోలవరంపై పర్యావరణశాఖ వైఖరేంటీ?
న్యూ ఢిల్లీ: పోలవరం కేసుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాలని ఒడిశాకు చెందిన రేల అనే సంస్థ ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్స్ ను ఎందుకు పదే పదే నిలిపేస్తున్నారని ఏపీనీ ఎన్జీటీ ప్రశ్నించింది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని ఎన్జీటీ దృష్టికి ఏపీ తీసుకువచ్చింది. పోలవరం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై రెండు వారాల్లోగా వైఖరి తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణనను అక్టోబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.