పోడు భూముల వివాదం
Published Sat, Apr 22 2017 1:52 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలం బోధపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ శివారులోని పోడు భూములలో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. పోడు భూములలో మొక్కలు నాటేందుకు వీళ్లేదని.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
Advertisement
Advertisement