ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది.
ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది.
ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు.
అటవీ ఉత్పత్తులే ఆధారంగా!
వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్‌పీస్‌ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు.
థింసా నృత్యం
మహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
సులువైన జీవనం
ఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.
అన్నీ చిన్న కుటుంబాలే!
గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్‌లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్‌లో పేరుంది.
(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!)
Comments
Please login to add a commentAdd a comment