వరంగల్(మంగపేట): వరంగల్ జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వివరాలు.. జిల్లా లోని మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పోగు రాధిక(18) అనే యువతి బుధవారం మధ్యాహ్నాం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్ర గాయాలైన రాధికను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఈ యత్నానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.