
పెళ్లింట అలుముకున్నవిషాదం
వరంగల్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదం అలుముకుంది. మరో రెండు రోజుల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన యువకుడు పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాలోని నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన పిట్టల వీరన్న అనే వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది.మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. ఇంతలో దొంగతనం నెపంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
దీంతో తీవ్ర ఆవేదన చెందిన వీరన్న బుధవారం పురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. అంతేకాక గ్రామంలో కొంతమంది యువకులు దొంగతనాలు చేస్తూ చెడ్డపేరు తీసుకొస్తున్నారంటూ సూసైట్ నోట్ రాసి ఉంచాడు. రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.