
మృతిచెందిన రమేష్, హర్య
చిల్పూరు : మండలంలోని మల్కాపూర్, పీచర రోడ్డులోని మా దవశెట్టి లక్ష్మయ్య వ్యవసాయ బావి సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెండారు. స్థానిక ఎస్సై గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ, మల్లారం గ్రామ సమీపంలోని వీర్లగడ్డతండాకు చెందిన గుగులోతు రమేష్(35), గుగులోతు హర్య(45)లు చిల్పూరు మండలం రాజవరం గ్రామంలో ఓ వివాహానికి హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలు దేరారు.
మల్కాపూర్ గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎదురుగా వేగంగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో రమేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాల కూర్చున్న హర్య దూరం ఎగిరి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న రమేష్‌కు భార్య రమ ఇద్ధరు ఆడపిల్లలు ఉండగా, వ్యవసాయం చేసుకునే హర్యకు భార్య అంబలి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన విషయం తెలియగానే జనగామ డీసీపీ మల్లారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఏ సీపీ వెంకటేశ్వరబాబు, సీఐ రావుల నరేందర్‌లు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన తీరును పరిశీలించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలి యగానే మృతుల బందువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని విలపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి క్రిష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి రంజిత్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు బబ్బుల వంశీ, పెరుమాండ్ల వేణు, వైఎస్సార్‌సీపీ మండల అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ జంగం రవి, చిల్పూరు గుట్ట దేవస్థానం డైరెక్టర్ వెన్నం మాదవరెడ్డిలు పరామర్శించారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment