పట్టుబడిన గిర్దావర్ సంపత్‌కుమార్
సాక్షి, పరకాల : కల్యాణలక్ష్మి లబ్ధిదారుడి నుంచి రూ. ఐదు వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఏసీబీకి చిక్కిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏసీపీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం పరకాల మండలం రాయపర్తి గ్రామానికి చెందిన పర్నెం శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు పెళ్లి చేసి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేçసుకున్నాడు. పథకానికి అర్హులు కావడానికి పలు ధృవీకరణ పత్రాలు అందజేశాడు. అయినప్పటికీ ఆరునెలలుగా నడికుడ ఆర్‌ఐ సంపత్‌కుమార్ పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులు పెడుతున్నాడు.
లంచం ఇస్తేనే పనిచేస్తానని స్పష్టం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కార్యాలయంలో సంపత్‌కుమార్‌కు రూ.ఐదు వేల లంచం అందజేశాడు. కొద్ది క్షణాలకే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. ఐదు వేలు స్వాధీనం చేసుకొని ఏసీబీ కోర్టుకు తరలించారు. నడికుడ తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం అయిన సమయంలోనే వీఆర్వో నుంచి ఆర్‌ఐగా ఉద్యోగోన్నతి పొందిన ఆయన ఏసీబీ చిక్కడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment