Revenue Inspector
-
ఆదివారం నాడు ఆఫీసుల్లో మీకేం పనయ్యా?
జడ్చర్ల: ప్రభుత్వ కార్యాలయంలో సెలవురోజున ఏం పనులు వెలగబెడుతున్నారంటూ ఓ ఆర్ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే...మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్ఐ వెంకట్‌రెడ్డి గిరప్పతో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నోట్స్ రాయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి ఆర్ఐ వెంకట్‌రెడ్డితోపాటు రికార్డులు రాస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. తలుపులు మూసుకొని రికార్డుల ఫైల్స్ రాయడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ అనుమతితో సక్సేషన్ రాస్తున్నామని ఆర్ఐ సమాధానం ఇవ్వడంతో, జేసీకి ఫోన్ కలపాలని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకొచ్చి రికార్డులు రాయించడం ఏమిటని నిలదీశారు. సంబంధిత ఆర్ఐపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తాము సెలవు రోజు కూడా కార్యాలయంలో పనులు చేస్తున్నామని ఆర్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. Jadcherla Congress MLA Anirudh Reddy caught a Revenue Inspector who was reportedly manipulating records in MRO office, on Sunday at Balanagar Mandal pic.twitter.com/xyjf3HlVSN— Naveena (@TheNaveena) June 23, 2024 -
నోట్ల మార్పిడి కేసు.. ఆర్ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విశాఖపట్నం: నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. బాధితులను బెదిరించి వారి నుంచి రూ.15 లక్షలు బలవంతంగా వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు ఆర్ఐ స్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డ్ శ్రీనివాసులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముగ్గురికి కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిని శనివారం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతోపాటు స్వర్ణలతను బ్యారెక్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆర్ఐతో పాటు కానిస్టేబుల్‌పై సీపీ చర్యలకు ఉపక్రమించారు. హోం గార్డు శ్రీనుదే కీలకపాత్ర ఎబ్బీ-2లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీను.. సూరిబాబుతో తనకున్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గతంలో గాజువాక, 2వ పట్టణ పోలీసు స్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై పలు ఆరోపణలు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోంగార్డుల ఆర్ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకొని విధులకు కూడా సరిగా హాజరుకాపోవడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఓ నేతలకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు.. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలో స్వర్ణలత నటించేలా చూస్తన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. రెండో భార్యతో కలిసి దోపిడికి ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శ్యామూల్ ప్రసాద్ ఇంట్లో దోపిడీకి ఎస్సై కృష్ణ, అతడి రెండో భార్యపాప పక్కా పథక రచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటిరకు ఈ కేసులో చింతలపూడి సురేంద్రబాబు, పాత నేరస్థుడు శ్రీశైలం, దుగ్గిపోగె ఆశీర్వాదంను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్సై కృష్ణ, అతడి రెండో భార్యపాప కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
Hyderabad: మహిళ పట్ల ఆర్ఐ అసభ్య ప్రవర్తన..ఒంటరిగా రా ఇస్తాననడంతో
సాక్షి, హైదరాబాద్: మంజూరైన వితంతు పింఛన్ కార్డును ఇవ్వాలని ఆర్ఐని అడగగా జాప్యం చేస్తూ ఒంటరిగా రా ఇస్తానని చెప్పడంతో ఈ విషయాన్ని సదరు మహిళ బంధువులకు చెప్పడంతో వారొచ్చి ఆర్ఐని తహసీల్దార్ సమక్షంలోనే చితకబాదిన ఘటన కలకలం రేపింది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో ఉంటున్న మైనార్టీ మహిళ(28), వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు మంజూరైన కార్డు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్ఐ విజయ్‌నాయక్‌ను అడిగింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదని, రోజు ఇబ్బంది పెటొద్దు ప్రేమతో అడిగి తీసుకోవాలంటూ ఆర్ఐ నాలుగైదు రోజులుగా ఇదే సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి సదరు మహిళ ఫించన్ కార్డు కోసం కార్యాలయానికి వచ్చి విజయ్‌నాయక్‌ను కార్డు అడిగింది. మళ్లీ అతడు అదే సమాధానం ఇచ్చాడని కుటుంబ సభ్యులతో పాటు బస్తీ వాసులకు తెలిపింది. కాసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చిన వారు తహసీల్దార్ అయ్యప్ప సమక్షంలోనే విజయ్‌నాయక్‌పై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన తహసీల్దార్‌ను సైతం నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది. ఫించన్ మంజూరైంది ఇంకా కార్డు రాలేదని రాగానే ఇస్తానన్నాను.. తప్ప ఒంటరిగా రా అనలేదని ఆర్ఐ విజయ్‌నాయక్ చెప్పుకొచ్చారు. కార్డు ఇవ్వడం ఆలస్యమైనందుకే బంధువులు, స్థానికులతో వచ్చి తనపై దాడి చేశారని ఆర్ఐ పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఇరువురు గాంధీనగర్ పోలీస్ పరస్పర ఫిర్యాదు చేసినట్లు సీఐ మోహన్‌రావు తెలిపారు. -
విజిలెన్స్ వలలో రెవెన్యూ అధికారి
కొరాపుట్( భువనేశ్వర్): విజిలెన్స్ వలలో కొరాపుట్ జిల్లా, సిమిలిగుడ ప్రాంత దుదారి రెవెన్యూ అధికారి ఖిరాది తన్నయ్య చిక్కుకున్నారు. ఓ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు జయరాం పంగి అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా జయపురం విజిలెన్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారి ఆస్తులపై ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టి, ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జయపురం విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. మరో ఘటనలో.. పాముకాటుతో వ్యక్తి మృతి జయపురం( భువనేశ్వర్): పాముకాటుకు గురైన జగన్నాథ్ గదబ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక జయపురం సమితి, కొంగ గ్రామపంచాయతీలో ఉన్న కొదమగుడ గ్రామంలో బుధవారం రాత్రి తన ఇంటి ముందు నిల్చొని ఉన్న జగన్నాథ్‌ను పాము కాటేసింది.ఈ క్రమంలో వైద్యసేవల నిమిత్తం అతడిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే రాత్రి అక్కడే చికిత్స పొందుతుండగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు గురువారం అప్పగించారు. చదవండి: Chain Snatching: పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ! -
ఎమ్మార్వో సుజాత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
ఎమ్మార్వో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్ భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించిన కూడా ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు, నగలు విషయంలో సుజాత ఆధారాలు చూపించలేదని తెలిసింది. శాలరీ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేశానని సమాధానం చెప్పినట్లు సమాచారం. బ్యాంక్ నుంచి డ్రా చేస్తే డాక్యుమెంట్లు చూపించాలని ఏసీబీ అధికారులు అడిగినా కూడా ఆమె స్పందించ లేదని సమాచారం. సుజాత ఇంట్లో షేక్‌పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోమవారం మరో ఆమెను విచారించే అవకాశం ఉంది. (రూ.30 లక్షలు ఎక్కడివి?) కాల్ లిస్టులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్‌లిస్ట్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్, ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్ లను రిమాండ్ కు తరలించారు. లంచం కేసులో సుజాత పాత్ర ఉందని తేలితే సుజాతను కూడా రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. (అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) -
ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు ఎక్కడివి?
సాక్షి, హైదరాబాద్ : షేక్‌పేట భూవివాదం కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు తొమ్మిది గంటల విచారణ తర్వాత ఎమ్మార్వో సుజాతను ఇంటికి పంపించారు. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారిని పిలిచి అధికారులు వివరాలు సేకరించారు. (చదవండి : అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 3 లక్షలు డిమాండ్) మరోవైపు ఆర్ఐ నాగార్జున రెడ్డి విచారణ కొనసాగుతోంది. మరికాసేపట్లో నాగార్జునరెడ్డిని రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్సై రవీంద్రనాయక్‌ను రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని 4865 గజాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్లను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ
-
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన షేక్‌పేట ఆర్ఐ
సాక్షి, హైదరాబాద్: రూ.15 లక్షల లంచం తీసుకుంటూ షేక్‌పేట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు యజమాని నుంచి ఆయన రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. బయానాగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆర్ఐ నాగార్జునను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే స్థల వివాదంలో ఆర్ఐ నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్సై రవీందర్‌ను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాల స్థల వివాదంలో వీరిద్దరూ లంచాలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఎస్సై రవీందర్‌పై ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. (చదవండడి: జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా) స్థల వివాదమిదే! బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ఐ నాగార్జున, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ 50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. -
షేక్‌పేట ఆర్ఐ వంశీ సస్పెన్షన్
బంజారాహిల్స్: కల్యాణ లక్ష్మి చెక్కును లబ్ధిదారుడికి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసినందుకుగాను షేక్‌పేట మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 19 కళ్యాణలక్ష్మి చెక్కులను తన వద్ద ఉంచుకున్న ఆర్ఐ వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా డబ్బుల కోసం వేధిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో కళ్యాణలక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా తన వద్ద పెట్టుకోవడంతో పాటు దళారుల సహాయంతో డబ్బులు దండుకునేందుకు యత్నించినట్లు వాయిస్ రికార్డ్‌తో సహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన షేక్‌పేట తహసీల్దార్ వెంకట్‌రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ అతడిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిగా ఆర్ఐ వంశీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఫిలింనగర్ బస్తీల్లో విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసి భారీగా డబ్బులు దండుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. తాజాగా ఉదయ్‌నగర్‌కు చెందిన రమ్య అనే యువతికి గతేడాది మే6న వివాహం జరిగింది. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైనట్లు రమ్య సోదరుడు రాజ్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో అతను చెక్కు ఇవ్వాలని కోరుతూ ఆర్ఐ వంశీని సంప్రదించగా రెండు రోజుల్లో బ్యాంకుల్లో డిపాజిట్ అవుతుందని చెప్పాడు. కార్యాలయం చుట్టూ తిరిగినా చెక్కు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అదే బస్తీకి చెందిన టీడీపీ నేత బాలాజిగోస్వామికి చెప్పడంతో డబ్బులిస్తే తాను మాట్లాడి చెక్కు ఇప్పిస్తానని చెప్పాడు. బాధితుడు ఇదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, తహసీల్దార్ విచారణ చేపట్టారు. ఇటీవల 22 చెక్కులు మంజూరు కాగా అందులో మూడు చెక్కులు మాత్రమే లబ్దిదారులకు అందజేసినట్లు తేలింది. మిగిలిన చెక్కులు తన దగ్గరే ఉంచుకొని డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడి కావడంతోఆర్ఐ వంశీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
రూ.5వేలు లంచం తీసుకుంటూ..
సాక్షి, పరకాల : కల్యాణలక్ష్మి లబ్ధిదారుడి నుంచి రూ. ఐదు వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏసీపీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం పరకాల మండలం రాయపర్తి గ్రామానికి చెందిన పర్నెం శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు పెళ్లి చేసి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేçసుకున్నాడు. పథకానికి అర్హులు కావడానికి పలు ధృవీకరణ పత్రాలు అందజేశాడు. అయినప్పటికీ ఆరునెలలుగా నడికుడ ఆర్ఐ సంపత్‌కుమార్ పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులు పెడుతున్నాడు. లంచం ఇస్తేనే పనిచేస్తానని స్పష్టం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కార్యాలయంలో సంపత్‌కుమార్‌కు రూ.ఐదు వేల లంచం అందజేశాడు. కొద్ది క్షణాలకే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. ఐదు వేలు స్వాధీనం చేసుకొని ఏసీబీ కోర్టుకు తరలించారు. నడికుడ తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం అయిన సమయంలోనే వీఆర్వో నుంచి ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొందిన ఆయన ఏసీబీ చిక్కడం కలకలం రేపింది. -
ఆదిశేషయ్య అడ్డంగా దొరికాడు
ఇంటిపన్ను మార్చాలంటే డబ్బు.. ఖాళీస్థలాలకు పన్ను వేయాలంటే చేతులు తడపాల్సిందే.. ఇలా కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో ప్రతి పనికీ ముడుపులు వసూలు చేస్తున్న కొంత మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్లు కలెక్టర్ల వ్యవహారశైలి ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. గడచిన మూడేళ్లలో ఈ విభాగంపై మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగి ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మరో ఇద్దరు బిల్ కలెక్టర్లు కేసులో చిక్కుకున్నారంటే ఈ విభాగం పనితీరు ఎంత అవినీతిమయంగా ఉందో అర్థమమవుతోంది. కాకినాడ: జిల్లా కేంద్రం కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదిశేషయ్య రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవహారం ఉద్యోగవర్గాల్లో కలకలం రేపింది. కొన్నినెలలుగా అతడి వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ ఇంటికి పన్ను వేసేందుకు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కారు. ఈ విభాగంలో దాదాపు మూడేళ్ల క్రితం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్, బిల్ కలెక్టర్ విజయ్‌కుమార్ కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మరో ఏడాది తరువాత బిల్ కలెక్టర్ కృష్ణ కూడా ఇదే తరహాలో లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ ముగ్గురు సస్పెన్షన్‌కు గురై కొద్ది రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరగా మంగళవారం జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆదిశేషయ్య పట్టుబడిన తీరు ఆ శాఖలో కానరాని మార్పునకు అద్దంపడుతోంది. వాస్తవానికి కొత్తగా ఇల్లు కట్టి పన్ను వేయాలంటే రెవెన్యూశాఖదే కీలకపాత్ర. దరఖాస్తు చేసుకున్న తరువాత స్వయంగా ఇంటికి వెళ్లి ఆ ఇంటి కొలతలు ఆధారంగా ఇంటిపన్నును నిర్ధారిస్తారు. అయితే తక్కువ చదరపు అడుగులు చూపించి యజమానికి తక్కువ పన్ను వేసేలా చేసేందుకు ముడుపులు దిగమింగుతూ కార్పొరేషన్ ఆదాయానికి అనేక మంది ఆర్ఐ, బిల్ కలెక్టర్లు గండికొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్న ఇంటి పై అంతస్తును లెక్కల్లో చూపకపోవడం వంటి చర్యలు ద్వారా కూడా పన్ను చెల్లింపుదారుడికి ఊరటనిస్తూ వీరంతా ముడుపులు రూపంలో దోచుకుంటున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని అనేక ఖాళీ స్థలాలకు పన్నుల విషయంలో అవినీతికి అడ్డూఅదుపులేకుండా పోతోంది. చిన్న పూరిల్లు వేసి ఆ ఇంటికి డోర్ నంబర్ విధించడం ద్వారా నామమాత్రపు పన్ను పడేలా అనేక మంది సిబ్బంది చక్రం తిప్పుతున్నారు. ఈ పన్నుకు నాలుగైదింతలు ఖాళీ స్థలాల పన్ను ఉండడంతో వీరికి ఆదాయ మార్గంగా మారి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. తాజాగా పట్టుబడ్డ ఆదిశేషయ్య కేసులో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 25 రోజులుగా ముప్పుతిప్పలు కాకినాడ జగన్నాథపురంలోని హోత చంద్రమౌళి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిలో ఇల్లుకట్టుకుని పన్ను కోసం కార్పొరేషన్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పెద్ద మొత్తంలో పన్ను పడుతుందని, రూ.20వేలు ఇస్తే పన్ను తగిస్తానంటూ సదరు భవన యజమానిపై ఆర్ఐ ఒత్తిడి పెంచారు. బిల్ కలెక్టర్‌తోపాటు వచ్చి కొలతలు తీసుకున్నాక చంద్రమౌళితో బేరంపెట్టి పన్ను వేయకుండా ముప్పుతిప్పలు పెట్టడంతో చివరకు రూ.15వేలుకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌ను ఆశ్రయించారు. సదరు ఆర్ఐ అవినీతి వ్యవహారానికి మంగళవారం తెరపడింది. ఇదిలా ఉండగా రెవెన్యూ విభాగంలోని అవినీతిపై నిఘాపెట్టిన అధికారులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ట్రెజరీ విభాగాలపై కూడా ఓ కన్నేయాల్సిన అవసరం ఉందంటున్నారు. వర్షంలో ఆటోపై వెళ్లి మరీ... రూ.15వేలు లంచం కోసం ఎడతెరిపిలేని వర్షంలో ఆటోలో వెళ్లి మరీ ఆదిశేషయ్య ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. సొమ్ము తీసుకునేందుకు రమ్మంటూ చంద్రమౌళి నుంచి ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లగా ఏసీబీ వలపన్ని నగదుతో సహా ఆదిశేషయ్యను పట్టుకుంది. ఈ వ్యవహారంలో బిల్‌కలెక్టర్ శివకుమార్ పాత్రపై కూడా విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ సుధాకర్ చెప్పారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు డిమాండ్ చేస్తే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ దాడిలో డీఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు పుల్లారావు, మోహన్‌రావు, తిలక్, ఎస్సై నరేష్ తదితరులున్నారు. -
ఆర్ఐపై దాడి చేసిన టీడీపీ నాయకుడి అరెస్ట్
సాక్షి, నెల్లూరు: విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)పై దాడి చేసిన టీడీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్ఐకి ఫోన్ చేస్తే ఎత్తలేదని ఇందూరు వెంకట రమణారెడ్డి అనే టీడీపీ నాయకుడికి కోపం వచ్చింది. దీంతో ఆయన సరాసరి రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆర్ఐ షేక్ బషీర్‌పై దాడి చేశాడు. దాడిలో అతనికి చేయి విరగగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత ఆర్ఐ, రెవెన్యూ ఉద్యోగులు ఆత్మకూరు పోలీసు స్టేషన్లో అదేరోజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం రమణారెడ్డి, అతని అనుచరుడు నూర్‌బాషా(మహ్మద్)లను అరెస్టు చేసి జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆయన వారిద్దరికి 14 రోజులు రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్నఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జైలు వద్దకు చేరుకుని రమణారెడ్డిని పరామర్శించారు. -
మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో లుకలుకలు!
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. దండిగా కాసులు వచ్చే పోస్టుల్ని వదులుకునేందుకు ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. ఇందుకోసం పొలిటికల్ గాడ్ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) పోస్టుల బది‘లీల’కు సంబంధించి కొందరు యూనియన్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవలే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ వద్ద పంచాయితీ పెట్టి మరీ ఉద్యోగులు ఆక్రోశం వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్పొరేషన్లో మూడేళ్లు పూర్తి చేసుకున్న 65 మంది మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు పరిపాలనా విభాగం అధికారులు (సి-సెక్షన్) ఫైలు సిద్ధం చేశారు. ప్రతి మూడేళ్లకూ ఓసారి మినిస్టీరియల్ ఉద్యోగుల్ని అంతర్గత బదిలీలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రజారోగ్య, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూసీడీ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయిలో బదిలీ చేసేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. మినహాయింపుపై గుర్రు మూడు సర్కిళ్ల పరిధిలో 13 ఆర్ఐ పోస్టులు ఉన్నాయి. ఇందులో తొమ్మిది మందికి మూడేళ్లు నిండాయి. రెవెన్యూ విభాగంలో ఆర్ఐ పోస్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ పోస్టుల్ని బదిలీల నుంచి మినహాయించే ప్రయత్నాలకు తెరలేచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ఆర్ఐలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు కొద్ది నెలల క్రితం సర్కిళ్లు మారారు. దీంతో తమకు బదిలీలు వర్తించవనే కొత్త వాదనకు తెరతీయడం వివాదాస్పదంగా మారింది. గతంలో ఆర్ఐలుగా విధులు నిర్వహించిన ముగ్గురికి ఇటీవలే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆర్ఐ పోస్టులే దక్కాయి. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి ఆర్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. గతంలో ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సమర్థత ఉంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి ఆర్ఐలుగా ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ దఫా బదిలీల నుంచి ఆర్ఐలను మినహాయిస్తే మరో మూడే ళ్ల వరకు వారే ఆ పోస్టుల్లో కొనసాగే అవకాశముంటుంది. దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఆర్ఐ పోస్టుల్ని దక్కించుకోవాలనుకొనే ఆశావహులు అన్ని విభాగాల్లో బదిలీలు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇటీవలే మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బదిలీల అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అదనపు కమిషనర్‌కు ఆ బాధ్యతల్ని అప్పగించారు. యూనియన్‌కు బదిలీల సెగ బదిలీల అంశం యూనియన్లోనూ విభేదాలకు తావిస్తోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరికి లబ్ధి చేకూర్చేలా యూనియన్ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పారదర్శకంగా బదిలీలు జరగకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆగస్టులో కృష్ణా పుష్కరాలు జరగనున్న దృష్ట్యా కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించాల్సిందిగా ఆయా విభాగాధిపతులు కమిషనర్‌ను కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు కమిషనర్ అంగీకరించే పక్షంలో మొత్తం బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పుష్కరాలు అయ్యాక బదిలీలు చేస్తే ఏ ఇబ్బందీ ఉండదన్న వాదన వినిపిస్తున్నారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
పార్వతీపురం (విజయనగరం) : లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కిరీటి మండలానికి చెందిన దొరన్న అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లీగల్ హైర్ సర్టిఫికెట్ కోసం దొరన్న అనే వ్యక్తి గత కొంత కాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతుండగా.. పని త్వరగా జరగాలంటే రూ. 4 వేలు ఇవ్వాలని ఆర్ఐ కిరీటి డిమాండ్ చేశాడు. దీంతో దొరన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. -
ఏసీబీకి పట్టుబడిన ఆర్ఐ
వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. శ్రీనివాస్‌రెడ్డి అనే రైతుకు ఈ పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా... ఆర్ఐ వి.శివలింగారెడ్డిని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ సిబ్బందితో కలసి శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. -
తహశీల్దార్, ఆర్ఐలను సస్పెండ్ చేసిన కలెక్టర్
నెల్లూరు : పాసు పుస్తకాల జారీలో అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్, ఆర్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట తహశీల్దార్ ఐ.మునిలక్ష్మి ఓ రైతుకు చెందిన భూమిని మరొకరికి బదిలీ చేసి పాసు పుస్తకాలు మంజూరు చేశారు. మండలంలోని కడపత్ర గ్రామానికి చెందిన వాకిట రామనాథమ్మ అనే రైతు మృతి చెందింది. దాంతో ఆమెకు చెందిన భూమిని తహసీల్దార్ మునిలక్ష్మి.. ఆర్ఐ మునికిరణ్‌తో కలసి వేరే వ్యక్తికి బదిలీ చేసింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తహశీల్దార్ అక్రమాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కలెక్టర్ ఎం.జానకి జారీ చేశారు. -
ఏసీబీ వలలో కార్పొరేషన్ ఆర్ఐ
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. వివరాలు.. కాకినాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి పేరు మార్పిడి కోసం రాగా ఆర్ఐ సుధాకర్ రూ.20 వేలు లంచం అడిగాడు. చివరకు రూ.10 వేలకు బేరం కుదిరింది. ఆ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. వారిచ్చిన సూచన మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా సుధాకర్‌ను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
‘స్వచ్ఛ’ రెవెన్యూ!
ఆ శాఖ ప్రక్షాళనకు యంత్రాంగం నిర్ణయం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారికి స్థానచలనం ఆరోపణలు మూటగట్టుకున్నవారిపై బదిలీ వేటు జాబితాపై అధికారుల కసరత్తు రెవెన్యూశాఖ ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సర్కారీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని ఇంటిదొంగలపై చర్యలతోపాటు స్థానచలనం కలిగించే దిశగా మల్లగుల్లాలు పడుతోంది. ఒకే చోట మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్ఓ), రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), మండల సర్వేయర్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆక్రమణదారులతో కుమ్మక్కు కావడంతో విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయని గుర్తించిన జిల్లా యంత్రాంగం... శివారు మండలాల్లో తిష్టవేసిన రెవెన్యూ ఉద్యోగులను సమూలంగా మార్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చెరువు శిఖం భూములు సహా సర్కారీ స్థలాల పరిరక్షణను పట్టించుకోకుండా.. కబ్జాదారులతో కలిసి రికార్డులు తారుమారు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రజాదర్బార్‌లోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వీఆర్ఓ, మండల సర్వేయర్ల అక్రమాల పర్వం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నట్లు గుర్తించిన 10 మంది వీఆర్ఓలను సస్పెండ్ చేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సస్పెండయిన పది మంది వీఆర్ఓలు శివారు మండలాల్లో పనిచేస్తున్నవారే కావడం విశేషం. ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన మరికొంతమంది ఆర్ఐ, మండల సర్వేయర్ల చిట్టా కూడా జిల్లా యంత్రాంగానికి అందింది. వీరిపై కూడా అంతర్గత విచారణ ప్రారంభించిన అధికారులు చర్యలకు ఫైలును సిద్ధం చే స్తున్నారు. శామీర్‌పేట, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్ తదితర మండలాల్లో వీఆర్ఓలు చక్రం తిప్పుతుండడం... రెవెన్యూ పాలనావ్యవస్థ వారి కనుసన్నల్లో కొన సాగుతుందనే ఆరోపణలు వచ్చాయి. భూముల క్రమబద్ధీకరణలోనూ వీరి చేతివాటం ఉంద ని తెలియడంతో మండలస్థాయిలో ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. వచ్చే నెలలో బదిలీలు! అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల జాబితా సిద్ధమవుతోంది. శివారు మండలాల్లో పనిచేస్తున్న 220 మంది వీఆర్ఓలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాలని, అక్కడి వారిని ఇక్కడకు మార్చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నందున.. వచ్చే నెలలో ఆంక్షలు సడలించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా జాబితాకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సస్పెండయిన వీఆర్‌ఓల్లో పలువురిని ఇప్పటివరకు తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. మరోవైపు అకారణంగా తమను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వీఆర్ఓల సంఘం ఆరోపిస్తోంది. చిన్న తప్పులకు తమను బలిపశువును చేయడం ఎంతవరకు సబబని వాపోతోంది. ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన టీఎన్జీఓ సంఘం కూడా తమకు అండగా నిలవ కపోవడంపై ఆ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తూ పత్రికాప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
మెదక్ (జహీరాబాద్ ) : భూవివాదంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఆర్ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దత్తారెడ్డి లంచం తీసుకుంటూ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ముఖ్తావలి బాబా దర్గాకు చెందిన భూవివాదంలో ఓ రైతు నుంచి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన ఆర్ఐ, వీఆర్ఓ
కర్నూలు: కర్నూలు జిల్లా దోర్నిపాడు మండల కేంద్రంలో రూ. 2 వేలు లంచం తీసుకుంటూ దోర్నిపాడు ఆర్ఐ వెంకటస్వామి, వీఆర్ఓ పుల్లారెడ్డి శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు శివరామి రెడ్డి అనే రైతు నుంచి రూ. 2వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్సీ మహబూబ్ పాషా నేతృత్వంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. (దోర్నిపాడు) -
అలేఖ్య.. లవ్ చీటర్ !
వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడకు చెందిన పూర్ణచందర్ ప్రేమ పేరుతో తనను వంచించాడని, న్యాయం చేయాలని అతడి ఇంటిముందు బైఠాయించి నానారభస చేసిన అలేఖ్యరెడ్డి అమాయకురాలేమీ కాదు.. ఆమె కూడా ఓ పెద్ద మోసగత్తె అనే విషయం ఆలస్యంగా తెలిసింది. బీటెక్ స్టూడెంట్‌నని, రెవెన్యూ ఇన్స్పెక్టర్నని రకరకాల హోదాలు చెప్పి యువకులతో పరిచయాలు పెంచుకోవడం.. కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ వలపుల వల వేయడం.. తర్వాత తనను మోసం చేశాడంటూ కేసులు పెట్టి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం.. ఇదీ ఆమె అసలు నైజం! అలేఖ్య వలలో చిక్కుకుని ఆమె భర్తతోపాటు నలుగురు యువకులు కేసులపాలు కాగా.. పూర్ణచందర్ అయిదో వ్యక్తి. అతడు తనను మోసం చేశాడంటూ ఫొటోలు చూపించి స్థానికులను, పోలీసులను, మీడియాను సైతం తప్పుదారిపట్టించింది. పూర్ణచందర్ కూడా అలేఖ్య దారిలోనే వెళ్లి ఆమె వలలో చిక్కుకున్నాడు. పూర్ణచందర్-అలేఖ్య వ్యవహారంపై ‘ప్రేమాయకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనం హైదరాబాద్ టాబ్లాయిడ్లోనూ ప్రచురితమైంది. ఈ కథనాన్ని చదివిన సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్యారెడ్డి స్పందించి అలేఖ్య అసలు చరిత్రను బయటపెట్టారు. వలపుల వలలో చిక్కితే అంతే.. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన అలేఖ్యరెడ్డి ఉరఫ్ బుజ్జీ ఉరఫ్ హేమ పసితనంలోనే తల్లి మరణించడంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. అలేఖ్య విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వెళ్లి ఉమెన్ ్స హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఈక్రమంలోనే రవీందర్ అనే వ్యక్తిని వివాహమాడింది. కొంతకాలానికి రవీందర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులపై సరూర్‌నగర్ మహిళా పోలీస్టేషన్లో వేధింపుల కేసుపెట్టింది. క్రైం నంబర్ 14/13 ప్రకారం 420, 498(ఎ) 3అండ్4/డీపీ యాక్ట్ కేసులు బాధితులపై నమోదయ్యాయి. * చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 385/12 ప్రకారం.. జగ దీశ్వర్ అనేవ్యక్తిపై చీటింగ్, కిడ్నాప్ 324,509 కింద కేసులు పె ట్టింది. ఇక్కడా బాధితుడు బోరుమన్నాడు. * మరో వ్యక్తిపై క్రైం నంబర్ 62/13 ప్రకారం 342, 366, 307, 506, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్లతో కేసుపెట్టింది. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న పూర్ణచందర్ ఆమె వలలో చిక్కాడు. ప్రేమపేరిట తనను వంచించాడని, కిడ్నాప్‌చేసి వేధించాడని పేర్కొంటూ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 421/13 ప్రకారం 420, 323, 506 కేసులు పెట్టింది. దీంతో పూర్ణచందర్‌తోపాటు అతడి తల్లిదండ్రులు రాధ, రాంచందర్ రిమాండ్ కాలాన్ని జైల్లో గడిపారు. ఇటీవలే విడుదలైన వీరు వేములవాడకు వచ్చారు. ఇది తెలుసుకున్న అలేఖ్యరెడ్డి శనివారం రాత్రి వేములవాడకు వచ్చి అతడి ఇంటిముందు బైఠాయించి కొ త్త డ్రామాకు తెరలేపింది.ఈమె రాకతో పరు వుపోతుందని భావించిన వీరు ఇంటికి తా ళంవేసి వెళ్లిపోయారు. దీంతో అలేఖ్య ఆరోపణలు నిజమేనని స్థానికులు నమ్మేశారు. ఆమె ఓ చీటర్ సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్యారెడ్డి సోమవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. సరూర్‌నగర్ ఆర్ఐగా చెప్పుకున్న అలేఖ్యరెడ్డి పెద్ద మోసగత్తె అని ఆమె చెప్పారు. గతంలో ఉప్పల్ ఆర్ఐగా చెప్పుకొని స్థానికులకు ల్యాండ్ పోజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించే పేరిట పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. జంటనగరాల్లో మహిళా ఆర్ఐలున్న రెవెన్యూ కార్యాలయాన్ని గుర్తించి.. అందుకనుగుణంగా తనపేరును మార్చుకుని ఆ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గతంలో గుర్తించారని వెల్లడించారు. పూర్ణచందర్ సైతం.. వేములవాడకే చెందిన ఓ యువతిని పూర్ణచందర్ మూడేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఆమెను వదిలేశాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రి మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో అనుకోకుండా అలేఖ్యరెడ్డితో పరిచయం ఏర్పడింది. తనను సరూర్‌నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకున్న అలేఖ్య... తన తల్లి తహశీల్దార్‌గా మరణించిందని, ఆమె స్థానంలో తనకు కారుణ్య నియామకాల్లో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం దక్కిందని చెప్పింది. తన జీతంతోపాటు తల్లి పింఛన్, ఇంటి కిరాయిలు కలిపి నెలకు రూ.లక్ష ఆదాయం ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ నమ్మిన పూర్ణచందర్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఇంకేముంది ఆమె పాచిక పారింది. మూడు నెలలు తిరక్కుండానే ఇలా అడ్డంగా బుక్కైపోయాడు. -
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
గజ్వేల్/ జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్: ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టేశారు. పట్టామార్పిడి కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు డిమాండ్ చేసిన ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్)ని అతని కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పారిపోయే ప్రయత్నం చేసినా నిలువరించి అదుపులోనికి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జగదేవ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఉద్యోగవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధిత రైతు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జగదేవ్‌పూర్ మండలం బీజీ వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల నర్సయ్యకు ఇద్దరు కుమారులు సంతానం. నర్సయ్య, అతని పెద్దకుమారుడు కనకయ్య కొంతకాలం క్రితం చనిపోయారు. దీంతో నర్సయ్య పేరిట గ్రామంలోని 516, 517 సర్వే నంబర్లో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద, తన వదిన పేరుమీద పట్టా చేసి ఇవ్వాలని(మ్యుటేషన్) నర్సయ్య చిన్నకుమారుడు రాంచంద్ర 15 రోజుల క్రితం స్థానిక తహశీల్దార్‌ను సంప్రదించాడు. ఆర్ఐతో పంచనామా చేయించుకు రావాలని తహశీల్దార్ సూచించడంతో రాంచంద్రం ఆర్ఐ సతీష్‌ను కలిశాడు. మ్యుటేషన్ చేయాలంటే రూ.30 వేలు ఖర్చవుతుందని ఆర్ఐ చెప్పడంతో తాను పేద రైతుననీ, అంత ఇచ్చుకోలేనని రాంచంద్ర బతిమాలుకున్నాడు. అయితే పైసల్ తెస్తేనే పని చేసిపెడతానంటూ ఆర్ఐ సతీష్ తేల్చిచెప్పడంతో చివరకు రూ.20 వేలు ఇచ్చేందుకు రాంచంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.5 వేలు అప్పుడే చెల్లించాడు. మరోవారం రోజుల్లో మిగతా రూ.15 వేలు ఇచ్చి మ్యుటేషన్ కాగితాలు తీసుకువెళ్లాలని ఆర్ఐ చెప్పడంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. ఎంతగా ప్రయత్నించినా డబ్బు దొరకకపోవడంతో గురువారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రాంచంద్ర తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని కొంత తగ్గించాలని మరోసారి ఆర్ఐని బతిమాలుకున్నాడు. అయినప్పటికీ వినిపించుకోని ఆర్ఐ రూ.15 వేలు తెస్తేనే మ్యుటేషన్ కాగితాలు ఇస్తాననీ, లేకుంటే కాగితాలు తారుమారు చేస్తానంటూ హెచ్చరించాడు. ఆందోళనకు గురైన రాంచంద్ర మెదక్, నిజామాబాద్ జిల్లాల ఏసీబీ డీఏస్పీ సంజీవరావును సంప్రదించాడు. ఏసీబీ డీఎస్పీ సూచన మేరకు రూ.15 వేలు తీసుకుని సాయంత్రం 4.30 గంటలకు తహశీల్దార్ కార్యాలయం చేరుకున్నాడు. విధుల్లో ఉన్న ఆర్ఐ సతీష్‌కు డబ్బులు అందజేశాడు. ఈ సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేశారు. వెంటనే తేరుకున్న ఆర్ఐ డబ్బును అక్కడే పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఆర్ఐని అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ సంజీవరావు, లంచం ఆర్ఐ సతీష్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. లంచం కోసం వేధించే అధికారుల సమాచారమిచ్చి అవినీతి నిర్మూలనకు సహకరించాలని కోరారు. బాధితులు తమ ఫిర్యాదులను తన సెల్ 9440446155కు ఫోన్ చెప్పవచ్చన్నారు. దాడిలో మెదక్ పోలీసులు కూడా పాల్గొన్నారు.