పాసు పుస్తకాల జారీలో అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్, ఆర్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది.
నెల్లూరు : పాసు పుస్తకాల జారీలో అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్, ఆర్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట తహశీల్దార్ ఐ.మునిలక్ష్మి ఓ రైతుకు చెందిన భూమిని మరొకరికి బదిలీ చేసి పాసు పుస్తకాలు మంజూరు చేశారు. మండలంలోని కడపత్ర గ్రామానికి చెందిన వాకిట రామనాథమ్మ అనే రైతు మృతి చెందింది.
దాంతో ఆమెకు చెందిన భూమిని తహసీల్దార్ మునిలక్ష్మి.. ఆర్‌ఐ మునికిరణ్‌తో కలసి వేరే వ్యక్తికి బదిలీ చేసింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తహశీల్దార్ అక్రమాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కలెక్టర్ ఎం.జానకి జారీ చేశారు.