ఏసీబీ వలలో కార్పొరేషన్ ఆర్‌ఐ | ri in the custody of acb | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో కార్పొరేషన్ ఆర్‌ఐ

Published Mon, Aug 10 2015 6:30 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ri in the custody of acb

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు.  వివరాలు.. కాకినాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి పేరు మార్పిడి కోసం రాగా ఆర్‌ఐ సుధాకర్ రూ.20 వేలు లంచం అడిగాడు. చివరకు రూ.10 వేలకు బేరం కుదిరింది. ఆ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. వారిచ్చిన సూచన మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కార్పొరేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా సుధాకర్‌ను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement