నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు | Amid Of PLGA Week Celebrations Police Tighten The Security | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

Published Mon, Dec 2 2019 10:18 AM | Last Updated on Mon, Dec 2 2019 10:18 AM

Amid Of PLGA Week Celebrations Police Tighten The Security - Sakshi

సాక్షి, కాళేశ్వరం: సీపీఐ (పీపుల్స్‌వార్‌) విప్లవోద్యమంలో ధ్రువతారలుగా వెలిగిన నాయకులు నల్లా ఆదిరెడ్డి అలియాస్‌ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్‌ మహేష్, శీలం నరేష్‌ అలియాస్‌ మురళి ఎన్‌కౌంటర్‌లో మరణించి నేటికీ (సోమవారం) 20 ఏళ్లు పూర్తవుతుంది. వీరు భూ స్వామ్య, సామ్రాజ్యవాద నిరంకుశ పాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ పీపుల్స్‌వాల్‌ అగ్ర నాయకులుగా ఎదిగారు. 1999 డిసెంబర్‌ 2న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం కొయ్మూర్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసారు. ఈ ముగ్గురు నేలకొరిగిన కొమ్మూర్‌ ఎన్‌కౌంటర్‌ పోలీసులకు పెద్ద విజయం కాగా, పీపుల్స్‌వార్‌ పార్టీకి చరిత్రలో ఎప్పటికీ మానని నెత్తుటి గాయంగా మిగిలింది. అప్పటి నుంచి పోలీసులు అగ్ర నేతలపై దృష్టి పెట్టి ఏరివేతనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న పీపుల్స్‌వార్‌ పార్టీ 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి పూర్తిగా బలహీన ప డుతూ వస్తుంది. రాష్ట్రంలో ఉనికి కోసం తాపత్రయ పడుతూ ఇటీవల కాటారం సబ్‌ డివిజన్‌లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల పేరుతో కరపత్రాలతో వేస్తూ ఉనికి చాటుతున్నారు. 

అమరుల యాదిలోనే..
అగ్రనాయకుల జ్ఞాపకార్థ ఎన్‌కౌంటర్‌అయిన మరుసటి ఏడాది 2000 డిసెంబర్‌ 2న పీఎల్‌జీ ఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ)ను ఏర్పాటు చేశారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతియేట డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు వా రోత్సవాలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘానే పెట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాట కుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భద్రత..మహదేవపూర్‌ మండలంలో ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం   ప్రాజెక్టులోని లక్ష్మీ, సరస్వతీ బ్యారేజీలతో పాటు లక్ష్మీపంపుహౌస్‌లకు  ఇంటిలిజెన్స్‌ నిఘా విభాగం హెచ్చరికలతో భద్రతను ఏర్పాటు చేసింది. 

కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు
నేటి నుంచి జరిగే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాటకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోలను కట్టడి చేయడానికి గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement