
యాదగిరి(ఫైల్)
హన్మకొండ చౌరస్తా : తన పెళ్లిని తల్లి నిరాకరించందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం నయీంనగర్‌లో చోటుచేసుకుంది. హన్మకొండ హెడ్‌కానిస్టేబుల్ కృష్ణనాయక్ కథనం ప్రకారం.. హన్మకొండలోని పోచమ్మకుంటకు చెందిని పబ్బిషెట్టి యాదగిరి(36) పదేళ్లుగా నయింనగర్‌లో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల యాదగిరి హుజురాబాద్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. కాగా యువకుడి తల్లి ఉపేంద్ర ఈ వివాహాన్ని నిరాకరించింది.
తన పెళ్లికి తల్లి అడ్డుకుంటోందని మనస్తాపం చెందిన యాదగిరి.. బుధవారం రాత్రి సిబ్బంది వెళ్లిపోయాక, మీసేవ కేంద్రంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సిబ్బంది తాళం తీసి ఉన్న షటర్‌ను తెరిచి చూడగా యాదగిరి ఆత్మహత్య చేసుకుని కనపించాడు. హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడు సోదరుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment