వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉదయం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన వస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, సిబ్బంది సరిగా రావడం లేదని వారు ఆరోపించారు.
సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు వాపోయారు. వైద్యులు వేళకు వచ్చి సేవలు అందించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, చర్యలు తీసుకోవాలని స్తానికులు డిమాండ్ చేశారు.
(మంగపేట)