గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని తేలింది. గతంలో తలకు దెబ్బ తగలటంతో వైరస్ కారణంగా ఆ సమస్య తిరగదోడి మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే చికిత్స నిమిత్తం అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం.. మెదడుకు ఆపరేషన్ చేయడానికి రూ. 3 లక్షల అవుతుందని వైద్యులు చెబుతున్నారు.. దాతలు సాయం చేసి తన భర్త ప్రాణాలు కాపాడాలని అనిల్‌యాదవ్ భార్య మహేశ్వరి వేడుకుంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సాయం చేయదలుచుకున్న దాతలు 93900 16564 నంబర్‌లో సంప్రదించాలని మహేశ్వరి అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment