dharmaram
-
బొలేరో, ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరి మృతి..
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్ని ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో ధర్మారం నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది.ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25), అందులో ప్రయాణిస్తున్న అఫ్జల్(55) క్యాబిన్లో ఇరుక్కుని మరణించారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ట్రాలీలోని ఆవు కొవ్వు డబ్బాలు, చర్మం రోడ్డుపై పడిపోయాయి.పెద్దపల్లి సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను కట్టర్ల సాయంతో బయటకు తీశారు. అన్వర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, అఫ్జల్ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు రమాదేవి, ఆగవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.ఆవు కొవ్వు ఎందుకోసం?బొలేరో ట్రాలీలో ఆవు కొవ్వు, చర్మం తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? రావాణాకు అనుమతి ఉందా? లేదా? ఆవు కొవ్వు, చర్మం దేనికి వినియోగిస్తారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ, మృతుల బంధువులు వస్తే పూర్తిసమాచారం తెలుస్తుందన్నారు. -
చివరి ఊరుపై చిన్నచూపు!
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండ లం చివరి గ్రామమైన ధర్మారం తండా అభివృద్ధి వి షయంలో పాలకులు, అధికారులు చిన్నచూపు చూ స్తున్నారు. అన్నిగ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తుండగా ధర్మారం తండాలో మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో ధర్మారం గ్రామం నుంచి తండాను వేరు చేశారు. గ్రామంలో సరైన రోడ్లు, డ్రెయినేజీలు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ భవనం మంజూరైనా.. ధర్మారం తండాలో గ్రామ పంచాయతీ భవనం ప్రస్తుతం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా స్థలం లేకపోవటంతో పనులు చేపట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న అటవీశాఖకు చెందిన స్థలం కొంత కేటాయిస్తే తప్పా భవన నిర్మాణం పనులు ముందుకుసాగేలా లేదు. ప్రజాప్రతినిధులు, ఫారెస్టు అధికారులు కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్పా భవనం నిర్మాణం నోచుకుంటుంది. -
ధర్మారం(బి)లో చిన్నారిపై హత్యాచారం..?
సాక్షి, డిచ్పల్లి (నిజామాబాద్‌రూరల్): డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వారం కిందట జరిగినా పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను వెంటతీసుకుని ధర్మారం(బి) గ్రామానికి నాలుగు నెలల క్రితం వలసవచ్చాడు. తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఒకరి వద్ద కూలీ పనికి చేరాడు. ఆ మహిళకు మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలు తమకు అడ్డుగా భావించాడు. వారం క్రితం రాత్రి పూట ఆరేళ్ల వయస్సున్న పెద్ద కూతురు పై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఆపై ఆమె తలపై రాయితో కొట్టి గాయపర్చాడు. అనంతరం చిన్నారికి ఫిట్స్ వచ్చాయని మహిళతో చెప్పి హడావిడి చేసి, చికిత్స పేరిట జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అనంతరం అతడు వారిని వదిలి పరారయ్యాడు. అనుమానం వచ్చిన చిన్నారి తల్లి తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే తన కూతురుపై అత్యాచారం చేశాడని డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయమై డిచ్పల్లి పోలీసులు స్పందించలేదు. -
పొలం బాట పట్టిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఎరువు చల్లి, నారు వేసి
సాక్షి, పెద్దపల్లి: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పొలంబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులో గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి తన పొలంలో నాటు వేస్తుండగా.. అటుగా వెళ్తున్న మంత్రి నేరుగా ఆయన పొలంలో దిగారు. లుంగి ధరించి రైతుతో కలిసి గొర్రు (జంబూ) కొట్టారు. పొలం మడిలో రసాయన ఎరువు చల్లారు. నారును మహిళా కూలీలకు అందించారు. మహిళలతో కలిసి సుమారు అరగంటపాటు నాటు వేశారు. అప్పటికే మధ్యాహ్నం కావటంతో కూలీలతోనే కలిసి భోజనం చేశారు. అక్కడినుంచి ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన ఎర్రగుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తోందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతోందని, పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందిస్తున్నామని వెల్లడించారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్ -
మెదడులో రక్తం గడ్డకట్టి.. ప్రాణాపాయ స్థితిలోకి..
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హమాలీ కార్మికుడు దొండ అనిల్‌యాదవ్‌కు వారం రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో వరంగల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని తేలింది. గతంలో తలకు దెబ్బ తగలటంతో వైరస్ కారణంగా ఆ సమస్య తిరగదోడి మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే చికిత్స నిమిత్తం అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం.. మెదడుకు ఆపరేషన్ చేయడానికి రూ. 3 లక్షల అవుతుందని వైద్యులు చెబుతున్నారు.. దాతలు సాయం చేసి తన భర్త ప్రాణాలు కాపాడాలని అనిల్‌యాదవ్ భార్య మహేశ్వరి వేడుకుంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సాయం చేయదలుచుకున్న దాతలు 93900 16564 నంబర్లో సంప్రదించాలని మహేశ్వరి అభ్యర్థించారు. చదవండి: ఎంజీఎం: ఒకరు కన్నుమూస్తేనే మరొకరికి బెడ్ -
మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్‌లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం. మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు.. మల్యాల.. మెరిసేనిలా గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చక్రాపూర్కు చక్కని గుర్తింపు గ్రామం: చక్రాపూర్ జిల్లా: మహబూబ్‌నగర్ మూసాపేట(మహబూబ్‌నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్‌లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిట్టపల్లి.. మిలమిల గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రుయ్యాడి.. ఐక్యత దండి గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్ తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ధర్మారం.. పనితీరులో బంగారం మండలం: ధర్మారం (మండల పరిషత్), జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్‌కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది. సుందిల్ల.. డబుల్ ధమాకా గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది. కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా.. మండలం: కోరుట్ల (మండల పరిషత్) జిల్లా: జగిత్యాల కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్‌కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది. పిల్లల అభివృద్ధి.. వికాసం గ్రామం: మోహినికుంట, జిల్లా: రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ‘సిరి’దాస్‌నగర్ గ్రామం: హరిదాస్‌నగర్ జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్‌నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి. పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్ తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్‌దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది. పాలనలో భేష్.. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్) సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్‌కు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. -
సర్జిపూల్ లీకేజీలకు మరమ్మతు
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్లో షట్టర్స్ వద్ద ఏర్పడిన ఎయిర్‌గ్యాప్ లీకేజీలను విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు సరిచేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని వేంనూర్ జీరో పాయింట్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా టన్నెల్ నుంచి తరలించి మేడారం సర్జిపూల్‌ను నింపారు. సర్జిపూల్ పూర్తి కెపాసిటీ 37 మీటర్లు కాగా 19 మీటర్ల వరకు నీటితో నింపారు. జీరోపాయింట్ నుం చి సర్జిపూల్ వరకు సమస్యలు లేకుండా నీరు చేరింది. సర్జిపూల్ వద్ద ఏర్పాటు చేసిన 7 మోటార్ల వద్ద ఎయిర్గ్యాప్లు ఏర్పడి లీకేజీ అవుతోంది. దీనిని గమనించిన ఇంజనీరింగ్ అధికారులు విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు అయిన నిపుణులతో లీకేజీలు సరిచేస్తున్నారు. 24న వెట్ రన్ : ఈఈ శ్రీధర్ ఈ నెల 24న సర్జిపూల్ మోటార్లతో వెట్‌రన్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. జీరో పాయింట్ నుంచి సర్జిపూల్ వరకు సక్రమంగానే ఉందన్నారు. 24న ఉదయం మొదటి పంప్ ద్వారా వెట్‌రన్ చేసిన తరువాత, సాయంత్రం రెండోపంప్ ద్వారా వెట్‌రన్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం నీటి కిందిభాగంలో పనులు చేస్తున్న క్రమంలో ఈతగాళ్లకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంటాం. నీటిలోకి దిగే మాస్కులు ధరిస్తాం. ఆక్సిజన్ సిలిండర్ వినియోగిస్తాం. – అక్షిత్, గజ ఈతగాళ్ల ఇన్చార్జి -
సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు ధర్మారామ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదాలకు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా తప్పిదాలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థిని పాస్ చేసిన ఇంటర్ బోర్డు అధికారులను ఏం చేయాలంటూ .... విద్యాశాఖ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి లెక్కలేనితనానికి విద్యార్థలు బాధితులు కావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
నేను చనిపోయాక నా ప్రేమ నిజమని నమ్ము
వెల్గటూరు(ధర్మపురి): ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేక నిద్రమాత్రలు మింగింది. బాధితురాలి కుటుం బసభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గ టూరు మండలం ముక్కట్రావుపేటకు చెందిన కొప్పుల స్వామి–సుశీలకు ఐదుగురు కూతుళ్లు. చిన్నకుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం జగిత్యాలలోని జ్యోత్స్న ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేసింది. ఈక్రమంలో అక్కడే పనిచేస్తున్న జగిత్యాలకు చెందిన కిరణ్‌తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అనూష కరీంనగర్‌లోని అపెక్స్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. వీరి ప్రేమాయణం మూ డేళ్లు కొనసాగింది. ఈక్రమంలో అనూష పెళ్లి చేసుకుందామనడంతో, మన కులాలు వేరని, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని కిరణ్ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని తన రూములో సూసైడ్ నోట్ రాసుకుని, స్వగ్రామం ముక్కట్రావుపేటకు చేరుకుని నిద్రమాత్రలు మింగింది. ఆలస్యంగా గమనించిన తల్లితండ్రులు ఆమెను కరీంనగర్ అపెక్స్ ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో పోరాడుతోంది. సూసైడ్ నోట్ వివరాలు.. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి. అక్కయ్యలు బావలు అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి. నేను ఎంతగానో ప్రేమించిన కిరణ్ వారి ఫ్యామిలీ నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. నేను ప్రాణంగా భావించిన కిరణ్ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. పైగా మన కుటుంబాన్ని మొత్తంగా రోడ్డున పడేస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన ద్వేషించడం తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవ్వరినీ తెలిసి బాధపెట్టలేదు. నా చావుకు పూర్తిగా కిరణ్ కుటుంబమే కారణం. నాకు బతకాలని ఉంది. అందరి ఆడపిల్లల్లాగా ఉండాలని ఉంది. అయినా కిరణ్ పెట్టే టార్చర్‌ను భరించలేకపోతున్నాను. అందుకే అందరిని విడిచి వెళ్తున్నాను. కిరణ్ నా ప్రాణాలను అడిగావు కదా ఇస్తున్నాను. నేను చనిపోయాక అయినా నా ప్రేమ నిజమని నమ్ము. ఇప్పటికైనా ఆడపిల్లను అనుమానించడం మానుకో, నీవు జాగ్రత్త. లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేసుకో. బై నిన్ను ప్రాణంగా త్రీ ఇయర్స్ ప్రేమించిన నీ అను’ అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
జీవచ్ఛవంలా...
రోడ్డు ప్రమాదంతో ఛిద్రమైన జీవితం మాట తప్ప శరీర స్పర్శ కోల్పోయిన వైనం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు కళ్లముందు ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దదైన కూతురికి పెళ్లి చేశారు. ఆమె ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తోందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఓ శుభకార్యానికి వెళ్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం... కుమార్తె జీవితాన్ని ఛిద్రం చేసింది. మాట తప్ప శరీరానికి స్పర్శలేకుండా పోయి.. మంచానికే పరిమితమైంది. రూ. లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా నయంకాకపోవడంతో చివరకు జీవచ్ఛవంలా మారిపోయింది. ప్రస్తుతం వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక, ఉన్న పిల్లలకు చదువు చెప్పించలేక ఆపన్నహస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ధర్మవరంలోని హౌసింగ్ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న నార్పల నాగిరెడ్డి, అనసూయమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె లక్ష్మికి 17 ఏళ్ల క్రితం నార్పలకు చెందిన ప్రభాకరరెడ్డితో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నార్పలలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా ప్రభాకర్‌రెడ్డి, ఇంటి వద్దనే టైలరింగ్ చేస్తూ లక్ష్మి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. తిరుపతికి వెళ్తూ... లక్ష్మి తమ్ముడు హేమసుందర్‌రెడ్డి కుమారుడి పుట్టు వెంట్రుకలు తిరుపతిలో తీయించేందుకు 2011 నవంబర్ 26న కుటుంబసభ్యులందరూ ఒకే వాహనంలో బయలుదేరారు. రాత్రి పూట ప్రయాణించే సమయంలో యూటర్న్ ఉన్న రోడ్డును డ్రైవర్ గమనించకపోవడంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. ఘటనలో నాగిరెడ్డి, అనసూయమ్మ, లక్ష్మి, ఆమె భర్త ప్రభాకరరెడ్డి, బంధువు హనుమంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మికి మెడపై నరాలు దెబ్బతిని, శరీరంలో చలనం లేకుండా పోయింది. అప్పటి నుంచి అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చికిత్సలు చేయించారు. దాదాపు రూ. 40 లక్షల వరకూ ఖర్చు చేసి తల్లిదండ్రులు చికిత్సలు చేయించారు. ఆయినా లక్ష్మిలో ఏ మార్పురాలేదు. దీంతో ఆమె మంచానికే పరిమితమైపోయింది. తలకు గాయాలు నయమైపోవడంతో ప్రభాకరరెడ్డి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను తిరిగి చూడలేదు. భార్యాపిల్లల బాగోగుల గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో లక్ష్మి పోషణ భారం తల్లిదండ్రులపై పడింది. మనవడు చరణ్‌తేజ్, మనవరాలు కీర్తిని చదివించడంతోపాటు కూతురు లక్ష్మికి చికిత్సలు చేయిస్తూ వస్తున్నారు. పొలం అమ్మిన డబ్బుతో.. ధర్మవరం డివిజన్ పరిధిలోని విద్యుత్‌శాఖలో హెల్పర్‌గా పనిచేసిన నాగిరెడ్డి.. తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన పీఎఫ్ డబ్బు రూ. 15 లక్షలను కూతురు వైద్యం కోసం ఖర్చు చేశాడు. అదీ చాలకపోవడంతో చెన్నేకొత్తపల్లి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల భూమిని రూ. 10 లక్షలకు అమ్మి చికిత్స చేయించారు. ఇంకా బంధువుల వద్ద అప్పులు చేశారు. మూడేళ్లు ఆస్పత్రుల్లోనే.... ప్రమాదానికి గురైన తర్వాత మూడేళ్ల పాటు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో లక్ష్మిని ఉంచి చికిత్స చేయించారు. క్రమేణ ఖర్చు పెరిగిపోతుండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు నెలకు రూ. 10 వేలు వెచ్చించి ఏడాది పాటు ఇద్దరు వైద్యులతో ఫిజియోథెరఫీ చేయించారు. చేతుల్లో చిన్నపాటి కదలిక వచ్చినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు.. లక్ష్మికి చికిత్స చేయించేందుకు ప్రస్తుతం డబ్బుల్లేక నాగిరెడ్డి దంపతులు అప్పు చేస్తున్నారు. ఆమెకు వైద్యం చేయించేందుకే ఇబ్బంది పడుతున్న తమకు పిల్లల చదువులు అదనపు భారంగా మారాయి. తాము బతికుండగానే కుమార్తెను మాములు మనిషిగా చూడాలనే తపన వారిలో నానాటికీ పెరిగిపోతోంది. దేవుడు చిన్నచూపు చూసి తాము ముందుగానే చనిపోతే చిన్న పిల్లలతో తమ కూతురు ఎలా జీవిస్తోందోనన్న వేదన వారిని మరింత కుంగదీస్తోంది. ఎవరైనా పెద్ద డాక్టర్లు, ప్రభుత్వం స్పందించి తమ కూతురు లక్ష్మిని మాములు మనిషిగా చేయాలని వృద్ధ దంపతులు కోరుకుంటున్నారు. చికిత్స కోసం దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిస్తే.. పేరు : నార్పల నాగిరెడ్డి బ్యాంక్ ఖాతా నం. : 11095747799 బ్యాంక్ శాఖ : స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధర్మవరం, అనంతపురం జిల్లా ఐఎఫ్ఎస్ కోడ్ : ఎస్బీఐఎన్0000250 ఫోన్ : 99855 60894 -
ఎల్లంపల్లి పైప్‌లైన్ లీక్
ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ లీకేజీ అయింది. ఎయిర్ గేట్ వాల్వ్ ఎగిరిపోవటంతో నీరు 100 అడుగుల ఎత్తులో ఎగసిపడుతోంది. దీంతో సమీప పొలాల్లోకి నీరు వృథాగా పోతోంది. ప్రెషర్ తగ్గిన తర్వాతే మరమ్మతులు చేపట్టడం వీలవుతుందని అధికారులు తెలిపారు. -
పట్టపగలే తాళాలు బద్దలు కొట్టి చోరీ
ధర్మారం (కరీంనగర్ జిల్లా) : ధర్మారం మండల కేంద్రం శివారులో దొంగలు పట్టపగలే ఓ ఇంట్లో చోరీ చేశారు. గోనె మధుసూదన్ తన భార్యతో కలసి సోమవారం మధ్యాహ్నం సమీపంలోని రాయపట్నం వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి లోపల బీరువాలో వస్తువులు చిందరవందరగా కనిపించాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో
ధర్మారం (కరీంనగర్ జిల్లా) : ధర్మారం ఎమ్మార్వో కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఎమ్మార్వో రమేశ్ కుమార్.. ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి దుంగతుర్తి వీఆర్వో శ్రీనివాస్‌ను లంచం డిమాండ్ చేశారు. వీఆర్వో నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు కింద పడి చిన్నారి మృతి
ధర్మారం (నిజామాబాద్): స్కూల్ బస్సు నుంచి దిగిన విద్యార్థి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం-బీ గ్రామంలోని ముదిరాజ్ వీధిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన బత్తెల మహేష్ (5) సెయింట్ జోసఫ్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా స్కూల్ బస్సులో ఇంటి వద్ద దిగాడు. బస్సుకి క్లీనర్ లేకపోవడంతో డ్రైవర్ చూసుకోకుండా నడపడంతో బాలుడు బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడికక్కడి మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కొమురెల్లి, శిరీషలు కన్నీరుమున్నీరయ్యారు. -
భోగి మంటల్లో పేలిన 'హిట్' స్ప్రేయర్
ధర్మారం (డిచ్పల్లి) : సంక్రాంతి భోగి మంటలు ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం తెచ్చిపెట్టాయి. భోగి మంటల్లో వేసిన దోమల మందు స్ప్రేయర్ 'హిట్' ట్యూబ్ పగలటంతో చిన్నారితోపాటు ముగ్గురు గాయాలపాలయ్యారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన రాకోలు సాయి, రమాదేవి దంపతులు తమ కుమారుడు రితేష్(3), వారి బంధువు శివకృష్ణతోపాటు గురువారం ఉదయం ఇంటి ముందు భోగి మంట వేసి అందులో పాత వస్తువులను పడవేసి అక్కడే కూర్చున్నారు. వాటిలో దోమలు, బొద్దింకలను చంపడానికి వాడే 'హిట్' స్ప్రేయర్ కూడా ఉంది. మంటల వేడికి బాటిల్ పేలి దాంట్లో మిగిలి ఉన్న మందు ఎగజిమ్మి అందరి ముఖాలు, చేతులపై పడింది. స్ప్రేతో పాటు మంటలు అంటుకున్నాయి. కుటుంబసభ్యులు వారిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలైన బాలుడు రితేశ్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. -
భార్యను చంపి పోలీసులకు లొంగిపోయాడు
ధర్మారం (కరీంనగర్) : కట్నం కోసం భార్యను చంపి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు ఓ భర్త. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వెంకటేశ్, స్వప్న(28)లకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా వెంకటేశ్ భార్యను మరింత కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యను కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి
కల్హేర్/మామడ/ ధర్మారం: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. మెదక్‌లో ఒకరు, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు కరెంటుకాటుకు బలయ్యారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన రైతు గైని సాయిలు (55) గురువారం ఉదయం ఇంటి నుంచి పొలం వెళ్లి తిరిగి రాలేదు. భార్య భూమవ్వ సాయంత్రం పొలానికి వెళ్లి చూడగా సాయిలు నిర్జీవంగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు అతని మృతదేహం పక్కగా వేలాడుతూ కనిపించాయి. కాగా, సాగు నిమిత్తం సాయిలు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడని, అవెలా తీర్చాలా అని బాధపడేవాడని, ఈ క్రమంలోనే విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబీకులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం కమల్‌కోట్ గ్రామానికి చెందిన రైతు అబ్బడి రాజేశ్వర్ రెడ్డి(44) విద్యుదాఘాతంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా ఉంటుందనే ఆలోచనతో.. బుధవారం రాత్రి 7 గంటలకు పొలానికి చేరుకున్నాడు. స్టార్టర్కు వచ్చే ఒక విద్యుత్తు తీగ కింద పడి ఉంది. చీకట్లో కనిపించక.. అది కాలికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం చామనపల్లికి చెందిన రైతు ఎండీ చాంద్‌మియూ(55) ఫ్యూజ్‌వైర్ వేస్తూ కరెంట్‌షాక్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచాడు. -
కోడలి ఆచూకీ కోరితే.. లంచం అడిగారు!!
కరీంనగర్ జిల్లా ధర్మారం ఎస్ఐపై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. తన కోడలు తప్పిపోయిందని, ఆచూకీ వెతకాలని బాలయ్య అనే వ్యక్తి ధర్మారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదుకు ఎస్ఐ 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారని బాలయ్య ఆరోపించారు. అంతేకాక, తనపై ఎస్ఐ దాడి కూడా చేశారని బాలయ్య హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌ను బాలయ్యా ఆశ్రయించారు.