నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండ లం చివరి గ్రామమైన ధర్మారం తండా అభివృద్ధి వి షయంలో పాలకులు, అధికారులు చిన్నచూపు చూ స్తున్నారు. అన్నిగ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తుండగా ధర్మారం తండాలో మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో ధర్మారం గ్రామం నుంచి తండాను వేరు చేశారు. గ్రామంలో సరైన రోడ్లు, డ్రెయినేజీలు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.
పంచాయతీ భవనం మంజూరైనా..
ధర్మారం తండాలో గ్రామ పంచాయతీ భవనం ప్రస్తుతం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా స్థలం లేకపోవటంతో పనులు చేపట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న అటవీశాఖకు చెందిన స్థలం కొంత కేటాయిస్తే తప్పా భవన నిర్మాణం పనులు ముందుకుసాగేలా లేదు. ప్రజాప్రతినిధులు, ఫారెస్టు అధికారులు కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్పా భవనం నిర్మాణం నోచుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment