కరీంనగర్ జిల్లా ధర్మారం ఎస్ఐపై మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది.
కరీంనగర్ జిల్లా ధర్మారం ఎస్ఐపై మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. తన కోడలు తప్పిపోయిందని, ఆచూకీ వెతకాలని బాలయ్య అనే వ్యక్తి ధర్మారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే, కేసు నమోదుకు ఎస్ఐ 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారని బాలయ్య ఆరోపించారు. అంతేకాక, తనపై ఎస్ఐ దాడి కూడా చేశారని బాలయ్య హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్ను బాలయ్యా ఆశ్రయించారు.