
జిల్లా అధికారులతో కలిసి జేఎన్‌ఎస్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న పవన్‌పూరి
వరంగల్ స్పోర్ట్స్ : ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి జిల్లా యంత్రాంగం సహకరించాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సికింద్రాబాద్ అధికారి పవన్‌పూరి కోరారు. గురువారం పలువరు జిల్లా అధికారులతో కలిసి హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హన్మకొండ ఏ సీపీ రాజేంద్రప్రసాద్, డీఆర్‌డీఏ డీడీ రాము, డీపీఆర్‌ఓ డీడీ జగన్, కార్పొరేషన్ ట్రాన్‌కో ఈఈ లక్ష్మారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment