JNS Stadium
-
ఆర్మీ రిక్రూట్మెంట్
వరంగల్ స్పోర్ట్స్ : ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి జిల్లా యంత్రాంగం సహకరించాలని రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అధికారి పవన్‌పూరి కోరారు. గురువారం పలువరు జిల్లా అధికారులతో కలిసి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హన్మకొండ ఏ సీపీ రాజేంద్రప్రసాద్, డీఆర్డీఏ డీడీ రాము, డీపీఆర్ఓ డీడీ జగన్, కార్పొరేషన్ ట్రాన్కో ఈఈ లక్ష్మారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఆర్డీఓ వెంకారెడ్డి ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పోలీసుల ‘ఆట’విడుపు
వరంగల్ : కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో భాగంగా పది రోజులుగా అభ్యర్థులకు దేహదారుఢ్య, క్రీడాంశ పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం జేఎన్ఎస్ స్టేడియంలో పరుగు పందెం నిర్వహించిన అనంతరం కాసేపు విరామం లభించడంతో ఈ ఎంపికల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఐలు, ఎస్ఐలు క్రీడల్లో తమ ప్రతిభను కనబర్చేందుకు ఆసక్తి చూపారు. షాట్‌పుట్ వేయడంలో పలువురు పోటీ పడ్డారు. ఇది గమనించిన సీపీ సుధీర్‌బాబు షాట్‌పుట్‌లో బాల్ ఎక్కువ దూరం విసిరిన మొదటి ముగ్గురికి నజరానా ఉంటుందని ప్రకటించడంతో వారిలో ఉత్సాహం రెట్టింపైంది. మొదటి స్థానంలో సీఐ నరేందర్, రెండవ స్థానంలో స్టేషన్ ఘనపూర్ సీఐ కిషన్, మూడవ స్థానంలో మడికొండ ఎస్ఐ విజ్ఞాన్‌రావు నిలవగా సీపీ సుధీర్‌బాబు వారిని అభినందించారు.