బ్రేకుల్లేని బస్సులా కేసీఆర్ పాలన | k. lakshman slams on telangana goverment | Sakshi
Sakshi News home page

బ్రేకుల్లేని బస్సులా కేసీఆర్ పాలన

Published Mon, Mar 9 2015 9:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బ్రేకుల్లేని బస్సులా కేసీఆర్ పాలన - Sakshi

బ్రేకుల్లేని బస్సులా కేసీఆర్ పాలన


  బీజేపీ శాసన సభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్
  అంకుశం వంటి ప్రతిపక్షం ఏర్పాటు చేయాలి
  ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావును గెలిపించాలి

 
 జనగామ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన బ్రేకుల్లేని ఆర్టీసీ బస్సులా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను మరిచి నచ్చితే నజరాన.. లేకుంటే జరిమాన అన్న ట్లు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న సీ ఎం కేసీఆర్‌కు కళ్లెం వేయాల్సిందేనని అన్నారు. లేకుంటే ఆయన ఒంటెద్దు పోకడకు అడ్డులేకుండా పోతుందని అన్నారు. దీనికి అంకుశం వంటి బలమైన ప్రతిపక్ష ఏర్పాటుకు పట్టభద్రులు పూనుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారమే ఏజెండాగా పోరాటం సాగిస్తున్న బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును గెలిపించాలని కోరా రు.శనివారం ప్రారంభమైన అసెంబ్లీ స మావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో హామీల అమలు ఊసే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొనని తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు.

సచివాలయ తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అం టున్న సీఎం తాను ఇచ్చిన హామీలను మా త్రం మరిచాడన్నారు. సమావేశంలో పార్టీ  జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి దుగ్యాల ప్రదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ, రాష్ర్ట నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నెల్లుట్ల నర్సింహారావు, పరమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్‌ఎన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి తేలి అశోక్, జిల్లా కార్యదర్శి ఉడుగుల రమేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, కౌన్సిలర్ దేవరాయ ఎల్లయ్య, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, పట్టణ అధ్యక్షుడు పిట్టల సత్యం పాల్గొన్నారు.


 పార్టీ ఫిరారుుంపులు ప్రోత్సహిస్తున్న సీఎం
 పార్టీ ఫిరారుుంపులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తలవంపులు తెస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ అన్నారు. హన్మకొండకు వచ్చిన ఆయన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగులు నష్టపోయూరన్న సీఎం.. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ డబ్బు ఆశ చూపి గెలిచే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, చాడ శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, శేషగిరిరావు, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
 మజ్లిస్ చేతిలో రిమోట్
 సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీ చేతిలో రిమోట్‌గా మారాడని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడే తప్పా ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో కారు అధికారంలో ఉన్నప్పటికీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందని మజ్లిస్ పార్టీ అంటున్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావు, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement