k.lakshman
-
దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?
-
దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కోరారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మరణం చాలా బాధాకరమని, అతడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబట్టే శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు పూర్తి బాధ్యత తెలంగాణ ద్రోహులైన మంత్రులదే. సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయకుండా రెచ్చగొడుతున్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు...‘పోరాటాల ద్వారా సాదించుకుందాం. సకల జనుల సమ్మెకు ఆర్టీసీ సమాయత్తం చేయాలి .అందుకు రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలి. శాంతియుతంగా ఆర్టీసి కార్మికులు సమ్మెను కొనసాగించాలి. ఆనాడు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏమయితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడో ఇప్పుడు కేసీఆర్ కూడా అవే మాట్లాడుతున్నారు. పోలీసు బలగాలను అడ్డు పెట్టుకొని సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కనీసం సెప్టెంబర్ మాసం జీతాలు కూడా కార్మికులకు ఇవ్వకుండా వారి కడుపు కొట్టారు ముఖ్యమంత్రి. దసరా పండగ రోజున 50 వేల మంది కార్మిక సోదరులు పస్తులు ఉన్న పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు అంటే తెలంగాణ బిడ్డలు కాదా?. చర్చలు జరిపేదే లేదు...మాట్లాడేదే లేదు అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేవలం కేసీఆర్ అనుచరులకు కట్టబెట్టేందుకు మాత్రమే ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఏమైనా భర్తీ చేసారా?. ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్‌ను కూడా దోచుకున్నారు. కేసీఆర్ ఉద్యోగుల మధ్య విభజన సృష్టించారు. సమ్మెలో విద్యార్థులు భాగస్వాములు అవుతారనే ముఖ్యమంత్రి సెలవులు పొడిగించారు. దసరా సెలవులు 22రోజులు ఇస్తారా?. విద్యార్థులు చదువుకోవాలా? వద్దా?. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ ప్రయివేటీకరణ చేయడానికి అభ్యంతరం లేదు. అయితే సంస్థ లాభాలకు మాత్రమే ప్రయివేటీకరణ చేయాలి. ఇక వరంగల్‌లో ఆర్టీసీకి చెందిన మూడున్నర ఎకరాలు ఎవరికి ఇచ్చారు’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. -
టీడీపీతో పొత్తు వల్లే ఎదగలేకపోయాం
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ పూర్తి స్థాయిలో ఎదగలేకపోయిం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా గెలవలేదని, బీజేపీ వల్లనే గెలిచారని పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1998 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలవడంతోపాటు, ఆంధ్రా లో 17 శాతం, తెలంగాణలో 21 శాతం ఓట్ల శాతం సాధించిందన్నారు. అలాంటి స్థితి నుంచి 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత తమ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారన్నారు. 2014లో కూడా విధిలేని పరిస్థితుల్లో బీజేపీతోనే టీడీపీ పోటీ చేసిందని గుర్తుచేశారు. 2019లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసొస్తే మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. జీహెచ్ఎంసీ, ఇతర స్థానిక అధికార యంత్రాంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నందున, ఎవరి ఓట్లు తొలగించాలన్న విషయంలో ఒక లక్ష్యంతో వ్యవహరించారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన ముషీరాబాద్‌లోనే ఆయా సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. కొత్త ఓటర్ల నమోదులోనూ జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు తీసుకోకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. మోదీనే మా ఐకాన్... లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తమ ఐకాన్ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో బీజేపీ మిత్రత్వం అనే ప్రశ్నే తలెత్తదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలిచినా కేసీఆర్ ప్రధాని కాగలరా, ప్రజలెందుకు ఆ పార్టీకి ఓటేయాలని ప్రశ్నించారు. పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని లక్ష్మణ్ వెల్లడించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి సీట్లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన లోక్‌సభకు పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో పాటు కొన్ని సీట్లు గెలుచుకుంటామనే విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ తేదీ తర్వాత ఒక్కో నియోజకవర్గం నుంచి అర్హులైన ముగ్గురి పేర్లను ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జీలు, కమిటీ నిర్ణయించి జాతీయ నాయకత్వానికి పంపుతామన్నారు. వీవీప్యాట్లతో అనుసంధానం, సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు పోలింగ్ ఒక గంట పెంచాలని, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లు మార్చాలని కోరారు. ఈసీ ద్వారానే వంద శాతం ఓటింగ్ స్లిప్‌లు పంపిణీ కాకపోతే, రాజకీయ పార్టీల కు ఆ అవకాశం ఇవ్వాలన్నారు. ఒక కుటుంబం ఓట్ల న్నీ ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)ని బీజేపీ ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జాతీయ పార్టీ నిర్దేశించిన ఐదు అంశాలపై రాష్ట్రంలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. -
నా వల్ల పార్టీకి ఇబ్బంది కాకూడదు
-
హామీలను అమలు చేయలేని టీఆర్ఎస్: బీజేపీ
హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రజల తరపున పార్టీ శ్రేణులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నగరంలో ఇప్పటికీ నిర్మించలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంపై మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పెరుగుతున్న క్లబ్బులు, పబ్బుల సంస్కృతి పై పోరాడాలన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. వితంతువులు కూడా సమాజంలో గౌరవంగా బతికేలా మహిళా మోర్చా కృషి చేయాలని కోరారు. సుష్మాస్వరాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని. ఈ నెల 22, 23 తేదీల్లో వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో మోర్చా నేతలు మాజీ మంత్రి పుష్పలీల, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను మోసం చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల (బీసీ) అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. వారిని మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మురళీధర్‌రావు కమిషన్ సిఫార్సుల కన్నా ఎక్కువ రిజ ర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినా వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు శూన్యమని మండిప డ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, ఎన్నికల్లో గెలిచాక ఆ ఊసే మరిచిపోయారని విమర్శించారు. సోమవారం పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కాటం నర్సింహయాదవ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన బడ్జెట్లలో బీసీలకు అరొకర నిధులు కేటారుుంచిందని, వాటినీ సరిగా ఖర్చు చేయలేదన్నారు. బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
20 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సంగారెడ్డి జోన్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కందిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణం, పట్టణ సమస్యలపై నవంబర్ 7నుంచి 11 వరకు పోరాటాలు చేస్తామన్నారు. అవినీతి, ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, ముంపు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. ఈ నెల చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం కరువు నిధులు రూ.729 కోట్లను ఎందుకు దారి మళ్లించారో వివరించాలన్నారు. -
నల్లగొండ నుంచే సమర శంఖారావం
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నల్లగొండ టూ టౌన్: కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వారి సమస్యలపై నల్లగొండ నుంచే బీజేపీ సమర శంఖారావం పూరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రైతు ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. లక్ష రూపాయల్లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే 4 దఫాలుగా చేస్తామని మాటమార్చారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైనింగ్ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారన్నారు. బతుకమ్మ పేరున కూతురు ప్రచారానికి సీఎం కోట్లు ఖర్చు పెడుతున్నారే తప్ప రైతాంగం కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టడానికి కూడా చేతులు రావడం లేదన్నారు. -
బ్రేకుల్లేని బస్సులా కేసీఆర్ పాలన
బీజేపీ శాసన సభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అంకుశం వంటి ప్రతిపక్షం ఏర్పాటు చేయాలి ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావును గెలిపించాలి జనగామ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన బ్రేకుల్లేని ఆర్టీసీ బస్సులా ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను మరిచి నచ్చితే నజరాన.. లేకుంటే జరిమాన అన్న ట్లు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న సీ ఎం కేసీఆర్‌కు కళ్లెం వేయాల్సిందేనని అన్నారు. లేకుంటే ఆయన ఒంటెద్దు పోకడకు అడ్డులేకుండా పోతుందని అన్నారు. దీనికి అంకుశం వంటి బలమైన ప్రతిపక్ష ఏర్పాటుకు పట్టభద్రులు పూనుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారమే ఏజెండాగా పోరాటం సాగిస్తున్న బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును గెలిపించాలని కోరా రు.శనివారం ప్రారంభమైన అసెంబ్లీ స మావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో హామీల అమలు ఊసే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొనని తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు. సచివాలయ తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అం టున్న సీఎం తాను ఇచ్చిన హామీలను మా త్రం మరిచాడన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్చార్జి దుగ్యాల ప్రదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ, రాష్ర్ట నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నెల్లుట్ల నర్సింహారావు, పరమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్ఎన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తేలి అశోక్, జిల్లా కార్యదర్శి ఉడుగుల రమేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, కౌన్సిలర్ దేవరాయ ఎల్లయ్య, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, పట్టణ అధ్యక్షుడు పిట్టల సత్యం పాల్గొన్నారు. పార్టీ ఫిరారుుంపులు ప్రోత్సహిస్తున్న సీఎం పార్టీ ఫిరారుుంపులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తలవంపులు తెస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్ అన్నారు. హన్మకొండకు వచ్చిన ఆయన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగులు నష్టపోయూరన్న సీఎం.. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావు మాట్లాడుతూ డబ్బు ఆశ చూపి గెలిచే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, చాడ శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, శేషగిరిరావు, శ్యాంసుందర్ పాల్గొన్నారు. మజ్లిస్ చేతిలో రిమోట్ సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీ చేతిలో రిమోట్‌గా మారాడని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నాడే తప్పా ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో కారు అధికారంలో ఉన్నప్పటికీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందని మజ్లిస్ పార్టీ అంటున్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాలను పరిరక్షించండి: లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఆలయ అర్చకుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కె.లక్ష్మణ్ ఆలయ అర్చకుల పరిస్థితిపై మాట్లాడారు. ఆలయ అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు దేవాలయాలు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు. దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'తప్పటడుగులు వద్దు'
హైదరాబాద్: బంగారు తెలంగాణలో తప్పటడుగులు వద్దని బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ రుణాలను ముందుగానే మాఫీ చేసి ఉంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదని అన్నారు. పరస్పర ఆరోపణలు, దూషణలతో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. మనకు రావలసిన విద్యుత్‌ను రాబట్టుకోవాలని, ఇలా రాజకీయాలు చేయడం మంచిదికాదని సలహా ఇచ్చారు. విద్యుత్ లేక హైదరాబాద్‌లో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. కేంద్రం నుంచి విద్యుత్ అందించడంలో తమ వంతు కృషి చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. ** -
టీఆర్ఎస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు
బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, మిగతా సమాజాన్ని విస్మరిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉద్యోగులకు ఈ నెల వేతనాలు 25వ తేదీన ఇస్తే తమకు అభ్యంతరం లేదని, దసరా, దీపావళి, క్రిస్మస్ తదితర పండుగలకూ ఇదే విధంగా ముందస్తుగా వేతనాలు చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తెలంగాణ బిడ్డలకు రూ.25లక్షలిచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో పుట్టి, హైదరాబాద్‌కు 1986లో వచ్చి పెరిగి, పాకిస్థాన్ కోడలిగా వెళ్లిన క్రీడాకారిణి సానియామీర్జాను తెలంగాణ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంతో పాటు రూ. కోటి నజరానా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 1956 స్థానికతను గుర్తిస్తామన్న ప్రభుత్వం ఆమెకు ఏవిధంగా అంబాసిడర్‌గా గుర్తించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యురాలైన కవిత జమ్మూ-కాశ్మీర్, తెలంగాణ ప్రాంతాలను బలవంతంగా దేశంలో కలిపారని చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. నిజాం పాలననుంచి విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్‌పటేల్‌ను అవమానించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మతప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును చేపడితే బీజేపీ వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ఆందోళలు చేపట్టి అడ్డుకుంటుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డిలు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.