20 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
సంగారెడ్డి జోన్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కందిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణం, పట్టణ సమస్యలపై నవంబర్ 7నుంచి 11 వరకు పోరాటాలు చేస్తామన్నారు.
అవినీతి, ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, ముంపు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. ఈ నెల చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం కరువు నిధులు రూ.729 కోట్లను ఎందుకు దారి మళ్లించారో వివరించాలన్నారు.