
కె.లక్ష్మణ్
హైదరాబాద్: బంగారు తెలంగాణలో తప్పటడుగులు వద్దని బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ రుణాలను ముందుగానే మాఫీ చేసి ఉంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు కాదని అన్నారు. పరస్పర ఆరోపణలు, దూషణలతో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు.
మనకు రావలసిన విద్యుత్ను రాబట్టుకోవాలని, ఇలా రాజకీయాలు చేయడం మంచిదికాదని సలహా ఇచ్చారు. విద్యుత్ లేక హైదరాబాద్లో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. కేంద్రం నుంచి విద్యుత్ అందించడంలో తమ వంతు కృషి చేస్తామని లక్ష్మణ్ చెప్పారు.
**