అర్హులైన రైతులందరికీ రుణమాఫీ: పోచారం
హైదరాబాద్ : అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరులోగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు. బ్యాంకులు ఇప్పటికే రూ.8,100 కోట్లు రుణాలు ఇచ్చాయని ఆయన సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వాటిలో బంగారం ఉన్న రుణాలు రూ.1,500 కోట్లు ఉన్నాయన్నారు. 7శాతం వడ్డీగా ఇచ్చిన రుణాలు మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తామని పోచారం తెలిపారు. 14 శాతం వడ్డీతో ఇచ్చిన బంగారం రుణాలకు రుణమాఫీ వర్తించదని ఆయన పేర్కొన్నారు.