డ్రిప్ ఇరిగేషన్కు 450 కోట్లు: పోచారం
డ్రిప్ ఇరిగేషన్ కోసం 450 కోట్ల రూపాయలు వెచ్చించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటే ఇటు నీటితో పాటు విద్యుత్తు కూడా ఆదా అవుతుందని ఆయన గురువారం అసెంబ్లీలో చెప్పారు.
డ్రిప్ ఏర్పాటుచేసుకునే ఎస్సీ, ఎస్టీలకు అయితే వంద శాతం రాయితీ ఇస్తామని, ఇతరులకు 90 శాతం రాయితీ ఇస్తామని ఆయన ప్రకటించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పోచారం వెల్లడించారు.