వరంగల్ : వరంగల్ జిల్లాలో వర్తన్నపేట ఎస్ఐ పై వేటు పడింది. వివరాలు.. గత శనివారం వర్థన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఐదో తరగతి చదువుతున్న ఓ బలుడిని వేధించిన క్రిష్ణకుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ డీజీపీ వరంగల్ రేంజ్ డీఐజీని ఆదేశించారు. అంతేకాకుండా, ఎస్సై తీరుపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
కాగా, స్తానికి గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న వీరన్న అనే బాలుడు ని పిబ్రవరి 28 న దొంగతనం నెపంతో పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న హాస్టల్ వార్డన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలుడిని హాస్టల్ కు తీసుకెళతామన్నా విడిచిపెట్టలేదు. రాత్రంతా బాలుడిని స్టేషన్ లోని నేరస్తులతో కలిపి మొద్దును కాళ్లకు బిగించి తాళాలు వేశారు. ఈ ఉదంతంపై బాలల హక్కుల సంఘం హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వర్థన్నపేట ఎస్సై సస్పెన్షన్
Published Mon, Mar 2 2015 6:08 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
Advertisement
Advertisement