నిట్‌లో వసంతోత్సవ కళ | NIIT spring art | Sakshi
Sakshi News home page

నిట్‌లో వసంతోత్సవ కళ

Published Thu, Feb 20 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

నిట్‌లో వసంతోత్సవ కళ

నిట్‌లో వసంతోత్సవ కళ

  •     రేపటి నుంచి స్ప్రింగ్ స్ప్రీ
  •      నేడు లాంఛనంగా ప్రారంభం
  •      ముమ్మరంగా ఏర్పాట్లు
  •      హాజరు కానున్న ప్రముఖులు
  •  నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ :  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం నుంచి స్ప్రింగ్ స్ప్రీ(వసంతోత్సవం) నిర్వహించనున్నారు. నిట్ వరంగల్ ఆధ్వర్యంలో ఏటా కల్చరల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో గాయనీ, గాయకుల ఆట, పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆన్‌లైన్ షోలు, నృత్యాలు, ప్రముఖ గాయనీగాయకుల పాటలు, పాశ్చాత్య సంగీత ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఈ మేరకు నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
     
    ఈవెంట్లు ఇవే..
     
    స్ప్రింగ్‌స్ప్రీలో భాగంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 40కి పైగా ఈవెంట్లు ప్రదర్శించనున్నారు. అల్లూరే, వార్ ఆఫ్ డీజే, ఐఆర్‌ఏ, టియర్ హిటప్, ఐడోల్, గేమ్ డోమ్, ఫుష్టల్, స్ట్రీట్ బాల్, గల్లీ క్రికెట్, ఫుడ్ ఫెస్టివల్, సోలో డ్యాన్స్, పెయిర్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్, వెస్ట్రన్ ఇన్‌స్ట్రిమెంట్ ప్రోగ్రామ్స్, నెహలే దే పెహలా.. యాహో జబర్‌దస్త్, రంగోలీ, పెయింటింగ్ కాంపిటీషన్, ఫొటో మెకానిజం, టీషర్ట్ డిజైనింగ్, ఆన్‌లైన్ ఈవెంట్స్, మిస్టర్ అండ్ మిస్ స్ప్రీ ఆన్‌లైన్ షోలు, షార్ట్ ఫిల్మ్ మేకింగ్స్ తదితర ఈవెంట్లు జరగనున్నాయి.

    ప్రముఖుల సంగీత కార్యక్రమాలు
     
    నిట్ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు సన్‌బార్న్ ఆధ్వర్యంలో డీజే షో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు టాలీవుడ్ గాయకురాలు సుచిత్ర పాటల కచేరీ, రాత్రి 9 నుంచి 10.30 వ రకు బాలివుడ్ ప్లేబ్యాక్ సింగర్ సూరజ్ జగన్ ఆధ్వర్యంలో హిందీ పాటల కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 23న రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు ప్రముఖ గిటారిస్ట్ బైజు ధర్మరాజన్ ఆధ్వర్యంలో రాక్‌బ్యాండ్ కార్యక్రమం, రాత్రి 8.30 నుంచి 9.15 గంటల వరకు ప్రముఖ డ్రమ్మర్ గినోబ్యాంగ్స్, గిటారిస్టు బైజు ధర్మరాజన్ ఆధ్వర్యంలో ఫ్యూషన్ బ్యాండ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
     
    అనూప్ రూబెన్స్, మిస్ ఇండియా శోభిత రాక

    స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమానికి మిస్ ఇండియా శోభిత దూళిపాళ, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరుకానున్నారు. మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న శోభిత దూళిపాళ తెనాలికి చెందినవారు. గత ఏడాది జరిగిన అందాల పోటీల్లో ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఇరవైకి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనూప్ రూబెన్స్ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. బుడ్డా హోగా తేరా బాప్ హిందీ సినిమాతోపాటు ఇష్క్, హార్ట్‌ఎటాక్, ప్రేమకావాలి, అడ్డా, గుండె జారి గల్లంతయిందే సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement