పాటలతో బిజీగా ఉండే గాయని సునీత ఆటల కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతిలోని వెంకటేశ్వర వెంటర్నరీ యూనివర్సిటీలో గురువారం క్రీడా సాంస్కృతిక ఉత్సవ ముగింపునకు ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. బహుమతులందజేశారు. అంతేకాదు తన గానలహరితో అందరినీ అలరించారు. అందంగా లేనా అని ఆమె పాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకం ప్రకటించారు.
యూనివర్సిటీక్యాంపస్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక ఉత్సవం వెట్ ఓరియన్–2017 ఓవరాల్ చాంపియన్‌గా తిరుపతి వెటర్నరీ కళాశాల నిలిచింది. నాలుగు రోజుల క్రీడా సంబరాలు గురువారంతో ముగిశాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రదానం చేశా రు. వ్యక్తిగత చాంపియన్‌గా గన్నవరం వెటర్నరీ కళాశాల విద్యార్థి మోహన్‌రావు, బాలికల చాంపియన్‌గా కిరణ్మయి నిలిచారు. తిరుపతి వెటర్నరీ కళాశాల బాలికల జట్టు 65 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని అందుకుంది.
అలాగే వివిధ క్రీడా, సాంస్కృతిక అంశాల్లో విజేతలకు గాయని సునీత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలి పారు. ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. తాను 3వ సంవత్సరం నుంచి సంగీత సాధన మొదలు పెట్టానని చెప్పారు. అనుకోకుండా సినీరంగంలోకి వచ్చి ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడ్డానన్నారు. వీసీ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకే క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల మంచి స్పందన లభించిందన్నారు. చక్కటి క్రీడా ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. కార్య క్రమంలో డీఎస్‌ఏ హరిజనరావు, అసోసియేట్ డీన్ ఈశ్వర్ ప్రసాద్, ఓఎస్‌ఏ రాంబాబునాయక్ పాల్గొన్నారు.
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..
బహుమతుల ప్రదానోత్సవం అనంతరం గాయ ని సునీత తన గానామృతంలో ఓలలాడించారు. ‘అందంగా లేనా... అసలేం... బాగాలేనా...’ అం టూ ప్రారంభించి ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’అన్న పాటతో ముగించారు. ఆమె పాటలకు విద్యార్థులు కేరింతలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment