auditorium
-
కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన భూమన
సాక్షి, తిరుపతి: నూతనంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను ఆదివారం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. రూ. 41 కోట్లతో నూతనంగా కచ్చపి ఆడిటోరియంను నిర్మించారు. ఈ ఆడిటోరియంను ప్రారంభించిన తర్వాత భూమన మాట్లాడుతూ.. కళాక్షేత్రంకు కచ్చపి అని పేరు పెట్టడం వెనుక ఒక చరిత్ర ఉంది. సరస్వతిదేవి వీణలో తీగ పేరు కచ్చపి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లతో మరో తిరుపతిని అభివృద్ధి చేసి చూపించాం. భక్తితో పాటు సాహిత్యం, సంగీతం కార్యక్రమాలతో కచ్చపి కళాక్షేత్రం కళకళలాడుతూ ఉండాలి’ అని పేర్కొన్నారు. -
Atmakur: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం
ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం కొత్త అందాలను సంతరించుకుంది. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ శివార్లలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుత పచ్చందాల పార్క్‌గా గుర్తింపు పొందింది. దశాబ్దం కిందట ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ థీమ్ ప్రాజెక్ట్ నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేక పోయింది. 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో స్మృతి వనానికి మహర్దశ వచ్చింది. ఆరునెలల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్లు విడుదల చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టింది. ఆయా పనులన్నీ ప్రస్తుతం పూర్తి కావడంతో స్మృతివనం కొత్త సొబగులద్దుకుంది. ఆరుబయలు ఆడిటోరియం... పచ్చదనాల ల్యాండ్‌స్కేప్ చిన్నపాటి శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా స్మృతివనంలో పచ్చటి కార్పెట్ గ్రాస్‌తో పరుచుకున్న తిన్నెలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూర్చుని కార్యక్రమం తిలకించే విధంగా మినీ వేదిక ఏర్పాటు చేశారు. దీని వెనుక ఒక తెర కూడా ఉండడంతో ఏవైనా రికార్డు చేసిన వీడియోలు, సినిమాలు ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ ల్యాండ్ స్కేప్ మధ్యలో రెండు గ్రానైట్ శిలా మండపాలు కూడా నిర్మించారు. అక్కడక్కడా గ్రానైట్‌తో ఏర్పాటైన అరుగులు పర్యాటకులు సేదతీరడానికి అనువుగా ఉన్నాయి. కనువిందుగా పర్యావరణ విజ్ఞాన కేంద్రం పర్యావరణంపై పర్యాటకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్మృతివనంలో పర్యావరణ విజ్ఞానకేంద్రానికి శ్రీకారం చుట్టారు. అయితే, నిధుల కొరతతో దశాబ్ద కాలంగా ఆగిపోయిన ఈ పనులు ఇటీవలే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. జీవకళలొలుకుతున్న పులిప్రతిమలు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన చిరుత పులుల ప్రతిమలు నిజం చిరుతలను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. చెట్టుపై ఎక్కి కూర్చున్నట్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సహజ వాతావరణంలో రాజసంగా నిలుచున్న పెద్దపులి ప్రతిమ వీక్షకులను సంభ్రమాశ్చ్యర్యాలకు గురి చేస్తోంది. అంతే కాకుండా విజ్ఞాన కేంద్రపు గోడలకు వేలాడదీసిన కొన్ని వన్యప్రాణుల చిత్రపటాలు చూడ ముచ్చటగొల్పుతున్నాయి. ఈ చిత్రపటాలన్నీ కూడా చేయితిరిగిన చిత్రకారులతో గీయించ బడిన కళాఖండాలు కావడం విశేషం. పిల్లను మోస్తున్న ఎలుగుబంటి, బరక భూములపై పరుగెత్తుతున్న బట్టమేక పక్షి, గడ్డిమైదానంలో కూర్చున్న కణితి, గాల్లో ఎగిరిపోతున్న కృష్ణ జింకల సమూహం, హనీబాడ్జర్ల చిత్రపటాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. రాతిపై జీవజాలం... వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్న పాదచర మార్గాలలో రాతి స్తంభాలపై పలు వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాల శిల్పాలను చెక్కించి ఉంచారు. వీటికి సహజ వర్ణాలతో తీర్చిదిద్దడంతో ప్రత్యక్షంగా వాటిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అదే విధంగా అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తీసిన వన్యప్రాణుల చిత్రాలను ఫ్లెక్సీలుగా తీర్చి దిద్ది పలుచోట్ల ఉంచారు. ఇవి కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: గుడ్లగూబలు దూరం.. అసలు విషయం ఏంటంటే?) -
ఓయూలో సాంస్కృతిక సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలతో ఓయూ క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. శనివారం ఠాగూర్ ఆడిటోరియంలో సాంస్కృతిక పోటీలను వీసీ ప్రొ.రవీందర్ ప్రారంభించారు. కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన సాంస్కృతిక పోటీలను చేపట్టడంతో ఓయూ పరిధిలోని వందలాది విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. తొలి రోజు డ్యాన్స్, మ్యూజిక్ విభాగాల్లో క్లాసికల్, ఫోక్, ట్రైబల్, దేశభక్తి నృత్యాలు, సంగీతంలో ఇండియా, వెస్ట్రన్ పాటలతో అందరగొట్టారు. ఎంపికైన విద్యార్థులను అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపిస్తారు. -
సీఎం జగన్ నిర్ణయం.. దళితుల హర్షం
సాక్షి, అమరావతి: గుర్రం జాషువా స్మృతికి రూ.3 కోట్ల నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాషువా సమాధి అభివృద్ధి, ఆడిటోరియం ఏర్పాటు కోసం ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, గుంటూరు నడిబొడ్డున జాషువా కళాప్రాంగణం అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28న జాషువా జయంతి సందర్భంగా తెలుగు అకాడమీ ద్వారా ‘సాహిత్య పురస్కారం’ ప్రదానం చేస్తామన్నారు. జాషువా గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై దళితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు.(దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) గుర్రం జాషువాకు నివాళి.. గుర్రం జాషువా 49వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి విజయవాడ సిటీ ప్రెసిడెంట్ బొప్పన భవకుమార్.. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు నివాళులర్పించారు. -
‘పద్మశ్రీ’ లీలాశాంసన్‌పై సీబీఐ కేసు
సాక్షి, చెన్నై: చెన్నైలో కళాక్షేత్రలోని ఆడిటోరియం పునరుద్ధరణ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అక్రమాలను గుర్తించింది. ఆ క్షేత్ర మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్‌పై కేసు నమోదు చేసింది. ఆమెతో పాటు అప్పటి నిర్వాహకులు తదితరులపై కేసులు నమోదయ్యాయి. చెన్నై తిరువాన్నియూరులోని ‘కళాక్షేత్ర’ ఫౌండేషన్‌లో 2006–12 మధ్య కాలంలో ఆడిటోరియం పునరుద్ధరణ కోసం కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు దుర్విని యోగమైనట్లు ఆరోపణలున్నాయి. -
ఆ శక్తులపై విజయం సాధిస్తాం
గువాహటి: భారత్‌లో కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు గొడవపడే ధోరణితో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి శక్తులపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు పైచేయి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అస్సాంలోని గువాహటిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ..‘ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, గ్రూపులు జగడాలమారితనంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు కొన్ని మినహాయింపులు మాత్రమే. మన న్యాయవ్యవస్థకున్న బలమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నివర్గాలకు సాయం చేస్తాయి. జడ్జీలు, న్యాయాధికారులు ఎల్లప్పుడూ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్లే న్యాయవ్యవస్థ మనుగడ సాగిస్తోంది’ అని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్లకు మించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు వెయ్యికిపైగా ఉన్నాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు. అలాగే 25 ఏళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నవి 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని జడ్జీలను కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 90 లక్షల సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 20 లక్షల కేసుల్లో(23 శాతం) సమన్లు కూడా జారీ కాలేదన్నారు. జడ్జీల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న తన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
పరిధుల ప్రభావం ప్రజలపై వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనప్పటికీ ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్ ఉండాలి’అని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చరిత్రలో తొలిసారిగా డీజీపీ మూడు కమిషనరేట్ల అధికారులతో భేటీ అయ్యారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో బుధవారం ‘యూనిఫాం సర్వీస్ డెలివరీ.. వన్ సిటీ–వన్ సర్వీస్–వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది సిటిజన్’పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి కొన్ని కీలక సూచనలు చేయడంతో పాటు అనేక ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేరరహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవల్ని కోరుకుంటారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ప్రతి పోలీసునూ మార్చాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్స్పెక్టర్లదని డీజీపీ స్పష్టం చేశారు. మూడు కమిషనరేట్లలోని ఏ ఠాణాకు వెళ్లినా ప్రజలకు ఒకే రకమైన స్పందన కనిపించాలని, బాధితుల సామాజిక–ఆర్థిక–వ్యక్తిగత హోదాల ఆధారంగా ఈ స్పందన మారకూడదని సూచించారు. సహయం కోరుతూ వచ్చిన బాధితులు/ప్రజలతో పోలీసుల వ్యవహారశైలి సక్రమంగా లేకుంటే ఆ ప్రభావం పోలీసు విభాగం మొత్తమ్మీద ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో మాదిరిగా మిగిలిన రెండింటిలోనూ టెక్నాలజీ వినియోగం పెరగాలని, ఫలితంగా నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి ప్రాజెక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు మిగిలిన చోట్లా అమలు కావాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల్ని డీజీపీ అభినందించారు. ప్రభుత్వం పోలీసు విభాగానికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తోందని, ప్రజలకు మేలైన సేవలు అందిస్తేనే సార్థకత ఉంటుందని సూచించారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు ప్రజల మన్నన పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన ప్రతిని డీజీపీ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ ఇన్చార్జ్ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ ఎం.భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గాలిలో ఆడిటోరియం
ఈదురుగాలులకు ధ్వంసం ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నైపుణ్య శిక్షణకు ఇబ్బందులు నిధులిస్తేనే నిలుస్తది కలెక్టర్ కనికరిస్తేనే విద్యార్థుల కష్టాలు దూరం కమాన్‌చౌరస్తా : ఇటీవల వర్షబీభత్సానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలోని ఆడిటోరియం పైకప్పు శిథిలావస్థకు చేరింది. అందులోని కొంతభాగం కూలింది. కళాశాలలో విద్యార్థినులు అధికంగా ఉండడంతో సమావేశాలు, శిక్షణ తరగతులు ఆ భవనంలోనే నిర్వహిస్తున్నారు. అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. అప్పటి కలెక్టర్ నీతూప్రసాద్ కొత్త ఆడిటోరియం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అరుుతే అంచనాల వద్దే నిలిచిపోరుుంది. ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుత కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తే ఇబ్బందులు దూరంకానున్నారుు. కెరీర్ గెడైన్స్ కీలకం మహిళలకు ప్రత్యేక కళాశాల అవడంతో చాలా మంది విద్యార్థినిలు ఇందులో ప్రవేశాలు తీసుకుంటున్నారు. పట్టణ విద్యార్థులతో పోల్చుకుంటే జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినిలే ఎక్కువగా ఇక్కడ ప్రవేశం పొందుతున్నారు. వీరికి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తేనే రాణించే అవకాశాలు ఉంటాయి. కెరీర్ గెడైన్స్ తరగతులు కూడా ఏటా కళాశాలలో నిర్వహిస్తున్నారు. సెమినార్స్, గెస్ట్లెక్చర్తోపాటు పలు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పలు ఉద్యోగ సాధనకు కావాల్సిన అన్ని విషయాలు ఇందులో నేర్పిస్తుంటారు. విద్యార్థులు వేల సంఖ్యలో ఉండడంతో చిన్న గది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తదీ అవసరమే ప్రస్తుతం కూలిన ఆడిటోరియం సామర్థ్యం 200 విద్యార్థులకు మాత్రమే సరిపోయేది. కానీ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థులు 2542 మంది ఉంటారు. ప్రత్యేక తరగతులకు దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆడిటోరియం పైకప్పు కూలడంతో చిన్నపాటి సమావేశాలు సైతం నిర్వహించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్న సమయంలో ఇలాంటి సమస్యలు మంచిది కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంచనాల వద్దే బ్రేక్ ఆడిటోరియం కూలిన సమయంలో దాని మరమ్మతుకు రూ.2.5కోట్ల అంచనాలతో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అంచనాలు తయూరు చేయూలని అప్పటి కలెక్టర్ నీతూప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో జిల్లాల పునర్విభజనతో ఆమె బదిలీపై వెళ్లారు. దీంతో ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోరుుంది. సెప్టెంబర్ 19న కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ సైతం వినతిపత్రం ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. ఆడిటోరియం లేదు గతంలో ఉన్న ఆడిటోరియం ఈదురుగాలులకు కూలింది. ప్రస్తుతం ఏ సమావేశాలు, శిక్షణ తరగతులైన ఇరుకు గదుల్లోనే జరగడంతో అందరు హాజరుకాలేకపోతున్నారు. కనీసం 2 వేల మందికి సరిపోయేలా ఆడిటోరియం నిర్మించాలి. - రమ్య, డిగ్రీ విద్యార్థిని నూతన భవనం కావాలి కళాశాలలోని ఆడిటోరియం పైకప్పు ఈదురుగాలులకు కూలిపోయింది. పాత ఆడిటోరియంలో 200 మంది మాత్రమే కూర్చునే వీలుంది. కళాశాలలో విద్యార్థులు వేల సంఖ్యలో ఉండడంతో సరిపోవడం లేదు. కనీసం 2వేల మంది కూర్చునేల ఆడిటోరియం నిర్మించాలి. పాతదానికి మరమ్మతు చేసి కొత్తది నిర్మించాలి. - టి.శ్రీలక్ష్మి ప్రభుత్వ, మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ -
‘కంటి’లో పుస్తక భాండాగారం...
పుస్తకం ప్రపంచాన్ని మన కళ్లముందు ఉంచుతుంది అంటారు. ఈ మాట నెదర్లాండ్స్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ ఎంవీఆర్డీవీకి బాగా తెలుసు అనిపిస్తోంది ఫొటోలో ఉన్న బిల్డింగ్‌ను చూస్తే. చైనాలోని తియాన్జిన్లో ఉన్న ఈ భవనం ఓ లైబ్రరీ కావడం ఒక విశేషమైతే... దూరం నుంచి చూస్తే ఇది ఓ కంటిని తలపించడం మరో వినూత్నమైన విషయం. భవనం మధ్యభాగంలో కనుగుడ్డును పోలిన ఓ గోళాకారపు నిర్మాణం ఉంటుంది. పూర్తిగా అద్దాలతో కట్టిన ఈ గోళాకారం చుట్టూ పిల్లలు, వయసుమళ్లిన వారి కోసం పుస్తకాలు, చదువుకునే ఏర్పాట్లు ఉంటాయి. అద్దాల గోళం లోపలిభాగంలో ఓ ఆడిటోరియం ఉంటుంది. ఈ 34200 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఈ గ్రంధాలయంలో మొత్తం ఐదంతస్తులు ఉన్నాయి. సెల్లార్ ప్రాంతంలో పుస్తకాలు భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిన్నపిల్లలు, వయసుమళ్లిన వారి కోసం ఏర్పాట్లు ంటే... ఒకటి, రెండవ అంతస్తుల్లో రీడింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులు రెండింట్లో కంప్యూటర్, ఆడియో గదులు, కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. జర్మన్ సంస్థ జీఎంపీ నిర్మిస్తున్న 120000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కల్చరల్ సెంటర్లో ఒక భాగమీ లైబ్రరీ. బిన్హాయి ప్రాంతం ప్రజలకు ఒక మీటింగ్ పాయింట్‌గా రూపొందుతున్న కల్చరల్ సెంటర్లో మరో మూడు భవంతులుంటాయి. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందని అంచనా. -
పల్లెగడపకు పరిశోధన ఫలాలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/పాలమూరు యూనివర్శిటీ: విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి.. పరిశోధన ఫలాలు పల్లెగడపకు చేరాలని నేషనల్ అసిస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్(నాక్) డెరైక్టర్ ప్రొఫెసర్ ఏఎన్.రాయ్ ఆకాంక్షించారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ప్రపంచదేశాలతో పోటీపడొచ్చని అభిప్రాయపడ్డారు. శనివారం పాలమూరు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన మొదటి స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు. నాణ్యత ప్రమాణాలు లేని విద్య వల్ల ఎలాంటి ప్రయోజనమూ చేకూరడం లేదని.. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే విశ్వవిద్యాలయాలకు సరైన నిధులు రావడంలేదని గుర్తుచేశారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రమాణాలు పాటించేలా జిల్లా విశ్వవిద్యాలయాలు ఎదగాలన్నా రు. యూనివర్సిటీలకు సంబంధించి నా క్ ఏటా వంద వర్క్‌షాపులు నిర్వహిస్తుం దని, వాటిలో ప్రమాణాలు ఏవిధంగా పాటిస్తున్నారో తెలియజేస్తుందే తప్ప సౌకర్యాలు కల్పించే సంస్థ కాదన్నారు. ప్రగతివైపు.. పీయూ అడుగులు అనంతరం పీయూ ఉపకులపతి జి.భాగ్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాలమూరు యూనివర్సిటీ(పీయూ) కేంద్ర బిందువుగా మారనుందని పీయూ ఉపకులపతి జి.భాగ్యనారాయణ ఉద్ఘాటించారు. ఆరేళ్లుగా పీయూ అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు. వెనుకబడిన ఈ జిల్లాలో పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పీయూను మంజూరు చేసిందని గుర్తుచేశారు. యూనివర్శిటీ ప్రాంగణంలో 12ఎకరాాల్లో రూ. 3.7కోట్లతో అధునాతనమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామన్నారు. ఐదు కోర్సులతో ప్రారంభమైన పీయూ ప్రస్తుతం 17కోర్సులకు విస్తరించిందన్నారు. జిల్లావ్యాప్తంగా 142 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అధ్యాపకుల కృషి అభినందనీయం మైక్రోబయోలజీ, మాలిక్యూలర్ బయోలజీలో పరిశోధనలకు రూపం తెచ్చే వేదికగా పీయూను తీర్చిదిద్దడంలో ప్రిన్సిపాల్ పిండిపవన్కుమార్ చేసిన కృషి అభినందనీయమన్నారు. పీయూ ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్ శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12న చేపట్టిన లార్జెస్ట్ బేర్ ఫూట్వాక్కు ప్రపంచ గిన్నిస్‌రికార్డు దక్కిందన్నారు. బీ ఫార్మసీ విద్యార్థులు జీ ప్యాట్‌లో అర్హత సాధించడాన్ని ఆయన అభినందించారు. ఈ విద్యాసంవత్సరం వనపర్తి, కొల్లాపూర్, గద్వాల పీజీ సెంటర్లను ప్రారంభించినట్లు వీసీ తెలిపారు. యూనివర్శిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాల భవనం, కామర్స్ మేనేజ్మెంట్, పురుషుల, మహిళా హాస్టళ్ల, పరిపాలన భవనాలు, గ్రంథాలయం, అకాడమిక్ బ్లాక్ ఫార్మసీ భవనాలను పూర్తిచేశామని వివ రించారు. పీయూ ప్రారంభం నుంచి రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్ కె.వెంకటాచలం యూనివర్శిటీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశాడని కొనియాడారు. పీయూ ప్రిన్సిపాల్స్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈసీ మెంబర్లు, ప్రతిఒక్కరూ పీయూ అభ్యున్నతికి కృషిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం 53 మంది విద్యార్థులకు గోల్డ్మెడ ల్స్, పట్టాలను న్యాక్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏఎన్. రాయ్, పీయూ ఉపకులపతి జి.భాగ్యనారాయణ అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శివరాజ్, పీయూ ప్రిన్సిపాల్ పిండి పవన్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.మధుసూదన్‌రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, ఈసీ సభ్యులు డాక్టర్ మనోజ, డాక్టర్ శ్యాముల్, శ్రీనివాసరావు తదిరులు పాల్గొన్నారు. నిరాశ పరిచిన గవర్నర్ ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్నాతకోత్సవం ఎంతో ఉత్సాహంగా నిర్వహించాలని, అందుకు తగ్గట్టుగానే పీయూ అధికారులు ఏర్పాట్లు చేశారు. పాలమూరు విద్యార్థుల కల నెరవేరిన తొలి కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ రాకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలాఉండగా, గోల్డ్‌మెడల్స్ అందుకోవడానికి విద్యార్థితో పాటు తమ తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థితో పాటు ఒక్కరికి మాత్రమే ఆడిటోరియంలోకి ప్రవేశం ఉందన్న నిబంధన విధించడంతో ఒక్కరు మాత్రమే ఆడిటోరియంలోకి వెళ్లి మిగతావారు బయటి నుంచే కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్సీడీలను ఏర్పాటుచేశారు. నాక్ డెరైక్టర్ ఏఎన్.రాయ్, ఇతర అతిథులకు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ బహూకరణతో కార్యక్రమం ప్రారంభమైంది. అతిథుల ప్రసంగం అనంతరం జాతీయగీతాలాపనతో ముగిసింది. పీయూ అధికారులపై ఆగ్రహం మొదటి స్నాతకోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించలేదని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి పీయూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సైతం నిరాశగా కనిపించింది. కార్యక్రమానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకు వేదికపై అవకాశం కల్పించకుండా మునిసిపల్ చైర్‌పర్సన్‌కు అవకాశం కల్పించడంపై కొందరు చర్చించుకున్నారు. కార్యక్రమంలో మధ్యలోనే వెళ్లిపోయారు. వచ్చిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులకు సౌకర్యాలు కల్పించడంలో పీయూ అధికారుల నిర్లక్ష్యం కొట్టుచ్చినట్లు కనిపించింది. సుమారు నాలుగు గంటల పాటు ఆడిటోరియంలో ఉన్న వారికి కనీసం తాగునీటిని కూడా ఏర్పాటుచేయలేకపోయారు. -
లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే
విద్యార్థులు.. నిత్యం పుస్తకాలతో కుస్తీ.. మార్కులపైనే దృష్టి. కానీ.. గురువుల ప్రోద్బలం.. ప్రోత్సాహంతో వయసుకంటే కంటే పెద్ద సాహసం చేశారు.. ఏకంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.. అందరి మన్ననలు పొందారు విద్యార్థులు పూర్ణ, ఆనంద్. ఈ ఘనత సాధించిన వారిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. కేయూక్యాంపస్ : లక్ష్యంతో ముందుకెళ్తే దేనినైనా సాధించవచ్చని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లే అందుకు సాక్ష్యమని అర్బన్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వవిద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ,అనంద్లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ.. జీవితంలో అనేక సవాళ్లు ఎదరవుతాయని, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. చిన్నవయసులోనే పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరం అధిరోహించడం గర్వకారణమన్నారు. కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. గురుకుల విద్యార్థుల కోసం ప్రవీణ్‌కుమార్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయన్నారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే ప్రణాళిక బద్ధంగా లక్ష్యంతో చదువుకుంటే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది గురుకులాల్లో డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సభకు స్వారోస్ జిల్లా అధ్యక్షుడు పట్టాభి అధ్యక్షత వహించారు. స్వారోస్ రాష్ర్ట కోకన్వీనర్ చలపతి, రాష్ట, జిల్లా స్వారోస్ బాధ్యులు పుల్లాకిషన్, రవి, కరుణాకర్, ఒంటేరు చక్రి, సదానందం, పరుశరామ్, కుంటా శ్రీనివాస్, మహేష్ , శోభన్‌బాబు, మానస, పీఈటీ శ్రీలత పాల్గొన్నారు. కలెక్టర్ అభినందన జిల్లాలోని స్వారోస్ కమిటీ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పూర్ణ, ఆనంద్‌లకు సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హన్మకొండలోని కీర్తిస్తూపం నుంచి ర్యాలీ ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కిషన్‌ను కలిసిన పూర్ణ, అనంద్లను ఆయన అభినందించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్నారు. -
‘బంగారు తెలంగాణే’ లక్ష్యం
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మినీ ఆడిటోరియం ప్రారంభం పూర్వ విద్యార్థుల సేవలు స్ఫూర్తిదాయకం చిట్యాల : బంగారు తెలంగాణ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని చల్లగరిగెలో 1984-85 పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ ఆడిటోరియంను స్పీకర్ శనివారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో స్పీకర్‌తోపాటు ప్రముఖ సినీ గేయ రచయిత, పూర్వ విద్యార్థి చంద్రబోస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్ఎం మెండు ఉమామహేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ సిరికొండ మాట్లాడారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సినీ పరిశ్రమను తన పాటలతో ఊర్రూతలూగిస్తున్న చంద్రబోస్ తన స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి స్నేహితులతో కలిసి కృషి చేయడం హర్షదాయకమన్నారు. అలాగే పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని, వాచ్‌మెన్‌ను నియమిస్తామని హామీ ఇచ్చారు. సాగర్ జలాలతో నియోజకవర్గంలో పంటలను సస్యశ్యామలం చేస్తామన్నారు. దోపిడీ, అవినీతి లేకుండా తెలంగాణ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. జన్మభూమి రుణం తీర్చుకుంటా..: చంద్రబోస్ జన్మనిచ్చిన ఊరు కన్నతల్లితో సమానమని, అలాంటి గ్రామానికి సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. నా ఊరి కోసం.. నా ఊపిరి ఉన్నంత వరకు సేవ చేస్తూ రుణం తీర్చుకుంటానని అన్నారు. స్నేహితులు పాఠశాల అభివృద్ధి కోసం అన్ని విధాల సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 750 సినిమాల్లో 2,900 పాటలు రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో గేట్, తాగునీటి నల్లాల సౌకర్యం కల్పించానని, మినీ ఆడిటోరియంకు రూ.1.30లక్షలు విరాళంగా ఇవ్వగా.. మిత్రులు రూ.1.70లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు. అనంతరం తాను రాసిన ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది.. ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది..’, ‘కనిపెంచిన అమ్మకు అమ్మనయ్యానుగా.. నడిపించిన నాన్నకు నాన్నయ్యానుగా..’ అనే పాటలు పాడి విద్యార్థులను, ప్రజలను ఊర్రూతలూగించారు. అనంతరం పూర్వ విద్యార్థులను స్పీకర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ బందెల స్నేహలత, ఎంపీటీసీ సభ్యురాలు బాలగోని శోభ, పీఏసీఎస్ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ బండిరాజు, టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు సిరికొం డ ప్రశాంత్, సదావిజయ్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, కుంభం రవీందర్‌రెడ్డి, ఆరేపల్లి మల్లయ్య, ఉప సర్పంచ్ అశోక్, పూర్వ విద్యార్థులు అప్పాల వెంకటరమణ, జగదీశ్వర్, రాజిరెడ్డి, లలిత, హైమావతి, విజయ్‌నాయక్, రమేష్, చంద్రమౌళి, మోహన్‌రెడ్డి, సమ్మయ్య ఉపాధ్యాయులు కొమురయ్య, రాము, నర్సయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేపు జిల్లాకు చెంచుల రాక భీమారం : భూపాలపల్లి నియోజకవర్గం రే గొండ మండలంలోని చెంచుకాలనీ వాసుల్లో ఒక్కరు మాత్రమే వరంగల్ నగరాన్ని చూశా రు... నగరానికి కేవలం 45 కిలోమీటర్ల దూ రమే ఉన్నా, వందేళ్లలో ఎవరూ ఇక్కడికి రాలే దు... వారికి పట్టణమంటే ఏంటో కూడా తెలి యదు... ఆ కాలనీని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. భీమారంలోని శ్రీసా యి జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి గా ప్రసంగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిపర్యటనలో చెంచుకాలనీకి వస్తానని హామీ ఇచ్చానని, ఈమేరకు అక్క డికి వెళ్లినట్లు స్పీకర్ తెలిపారు. తన తొలి వేతనం కూడా ఈ కాలనీకే అందించిన ట్లు చెప్పారు. వందేళ్లుగా నగరం ఎరుగని చెంచుకాలనీ వాసులకు వరంగల్ నగరాన్ని చూపిం చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ గ్రామస్తులను ఆరు బస్సుల ద్వారా నగరానికి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు చెంచుకాలనీ నుంచి బస్సులు బయలుదేరుతాయని, తొలుత ఖిలావరంగల్‌లోని కాకతీయుల కోటను సందర్శిస్తారన్నారు. రెండు గంటలపాటు కోట అందాల ను తిలకించిన అనంతరం అక్కడే మధ్యా హ్న భోజనం చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి, రాజరాజేశ్వరి ఆలయాలను సందర్శిస్తామని, ఇక్కడ మరో రెండు గంటలపాటు గడిపిన తర్వాత సాయంత్రం కలెక్టర్ కిషన్ ఇంటిలో తేనీటి విందుకు గ్రామస్తులతో సహా హాజరుకానున్నట్లు వెల్లడించారు. అనంతరం రామకృష్ణ టాకీస్‌లో శ్రీరామరాజ్యం సినిమా చూసిన తర్వాత తిరిగి గ్రామస్తులతో సహా చెంచుకాలనీకి బయలుదేరనున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి వివరించారు. -
రేవాలో రాజ్‌కపూర్ ఆడిటోరియం!
బాలీవుడ్ షోమ్యాన్ రాజ్‌కపూర్ పేరిట మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో ఆడిటోరియం నిర్మాణం జరగనుంది. రాజ్‌కపూర్ జ్ఞాపకార్థం త్వరలోనే ఇక్కడ ప్రపంచస్థాయి ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు మధ్యప్రదేశ్ పౌరసంబంధాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా ప్రకటించారు. రాజ్‌కపూర్ మామగారు అప్పట్లో రేవా రేంజ్ ఐజీగా పనిచేసేవారని ఆయన గుర్తు చేశారు. రాజ్‌కపూర్‌కు ఈ నగరంతో గల అనుబంధానికి గుర్తుగా ఆడిటోరియం నిర్మించనున్నామని చెప్పారు. -
సిద్ధార్థ వైద్య కళాశాలకు మొండిచెయ్యి
సీట్లు మంజూరుపై కరుణించని ఎంసీఐ రాష్ట్రంలో అన్ని కళాశాలలకు పునరుద్ధరించినా సిద్ధార్థకు దక్కని వైనం ఈ ఏడాది వంద సీట్లకే పరిమితం లబ్బీపేట : సిద్ధార్థ వైద్య కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కరుణించ లేదు. అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరుపై చివరి నిమిషంలోనైనా ఆమోదం వస్తుందన్న యూనివర్సిటీ అధికారులు ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 350 ఎంబీబీఎస్ సీట్లు పునరుద్ధరించిన ఎంసీఐ, సిద్ధార్థకు మాత్రం మొండిచెయ్యి చూపింది. వైద్య మంత్రి సొంత జిల్లాలో ఉన్న కళాశాలకు సీట్లు రప్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది సిద్ధార్థ వైద్య కళాశాల వందసీట్లకు పరిమితం కానుంది. సిద్ధార్థ కళాశాలకు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 40 శాతం, ఎస్వీయూ పరిధిలో 20 శాతం, ఉస్మానియా పరిధిలో 40 శాతం మందికి సీట్లు కేటాయిస్తారు. ఏకైక స్టేట్ వైడ్ కళాశాలగా ఉన్న సిద్ధార్థకు అదనపు సీట్లు కేటాయించక పోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులకు నష్టమేనని నిపుణులు చెపుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు పేర్కొంటున్నారు. బోధకులు కొరత తీవ్రంగా ఉండటాన్ని ఎంసీఐ గుర్తించినట్లు వారు అంటున్నారు. ఎంసీఐ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సీట్లు దక్కేవని చెబుతున్నారు. వంద సీట్లు ఉన్న కళాశాలకు 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో 50 మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన అడ్మిషన్లలో వాటిని భర్తీ చేశారు. అనంతరం 2013 మార్చిలో ఎంసీఐ బృందం తనిఖీలు చేసి సౌకర్యాలు లేని కారణంగా వాటిని రద్దు చేసేంది. గత ఏడాది వంద సీట్లనే భర్తీ చేశారు. అదనంగా సీట్లు మంజూరు చేయాలంటూ కళాశాల అధికారులు మళ్లీ ఎంసీఐకు ద రఖాస్తు చేయడంతో బృందం అకస్మికంగా తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికారుల నిర్లక్ష్యం కళాశాలకు అదనపు సీట్లు దక్కని విషయంలో అధికారుల వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రక్తనిధిని ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. ఎంసీఐ బృందం తనిఖీలను వస్తున్నట్లు ముందుగానే తెలిసినా పలు విభాగాలను సిద్ధం చేయలేదు. కళాశాలలోని ఓ విభాగంలో వైజ్ఞానిక ప్రదర్శన దుమ్ముపట్టి ఉండటాన్ని ఎంసీఐ బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకే తనిఖీలకు ఎంసీఐ సభ్యులు రాగా, 11 గంటల సమయంలో కూడా వైద్యులు విధులకు రావడం, ఐడీ కార్డులు, నెఫ్రాన్లు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల అదనపుసీట్లు రాక పోవడంలో పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారుల వైఫల్యం కూడా ఉంది. ఎంసీఐ అభ్యంతరాలు ఇవి టీచింగ్ క్లాసులు నిర్వహించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. బ్లడ్ బ్యాంక్‌కు ప్రత్యేక ప్రవేశ మార్గం ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. వ్యాధి నిర్ధారణ విభాగంలో సైతం అధునాతన పరికరాలు లేవని , ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం రిపేరులో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లైబ్రరీ, పెథాలజీ సెకండ్ డొమాస్టిక్ రూమ్, కమ్యునిటీ మెడిసిన్‌కు ప్రాక్టికల్ ల్యాబ్ లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్స్ లేక పోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికైనా సీట్లు దక్కే అవకాశం ఉంది. -
పరిశోధనలకు ప్రాధాన్యత
వర్శిటీలకు విశ్రాంత సీజే పిలుపు పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు లేవు ప్రైవేట్ సంస్థల్లాగా పని చేయాలి విశ్వ విద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని ఆపాలి హంసలేఖ సహా ఆరుగురికి డాక్టరేట్లు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని అనేక విశ్వ విద్యాలయాలు పరీక్షా మండళ్లుగా పని చేస్తున్నాయని, పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు అక్కడ లేవని భారత విశ్రాంత ప్రధాన న్యాయమూరి ఎస్. రాజేంద్ర బాబు నిష్టూరమాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. బెంగళూరు విశ్వ విద్యాలయం 49వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడి జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ప్రైవేట్ సంస్థల్లాగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వ విద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని ఆపాలని అన్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగంలో నాణ్యమైన మానవ వనరుల కొరత వల్ల విజ్ఞాన శాస్త్రం విస్తరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయానికి కఠోర పరిశ్రమ తప్ప వేరే దగ్గర దారులు లేవని అన్నారు. పరిపూర్ణ వ్యక్తిని తయారు చేయడమే విద్య అంతిమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. హంసలేఖ సహా ఆరుగురికి డాక్టరేట్లు ఈ కార్యక్రమలో సమాజ సేవా రంగంలో ఎస్ఎస్. అరకేరికి డాక్టర్ ఆఫ్ లాస్ (ఎల్ఎల్డీ), జీబీ. పరమ శివయ్యకు డాక్టర్ ఆఫ్ లెటర్ (డీ.లిట్), పత్రికా రంగంలో పీ. రామయ్యకు, విద్యా రంగంలో బీటీ. లక్ష్మణ్‌కు, సంగీత రంగంలో హంసలేఖకు డీ.లిట్లు ఇచ్చి సత్కరించారు. ఇదే సందర్భంలో 223 మందికి పీహెచ్.డీలు ప్రదానం చేశారు. మొత్తం 33,674 మంది పట్టాలను అందుకున్నారు. వీరిలో 16.004 మంది విద్యార్థులు, 17,670 మంది విద్యార్థినులు ఉన్నారు. స్నాతకోత్సవంలో వివిధ విభాగంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న 83 మంది స్వర్ణ పతకాలను అందుకున్నారు. రసాయన శాస్త్రంలో ఏఆర్. నూర్జహాన్ తొమ్మిది, ఎం.ఎస్సీ భౌతిక శాస్త్రంలో డీఎల్. శ్రుతి ఏడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. -
ఆడిటోరియం నిర్మాణం అభినందనీయం : డీజీపీ ప్రసాదరావు
జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్న పోలీస్‌బాస్ సాక్షి, నల్లగొండ తీవ్రవాదుల చేతిలో అసువులు బాసిన పోలీసు కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకు ఆడిటోరియం నిర్మిం చడం అభినందనీయమని డీజీపీ ప్రసాదరావు అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 1.50 కోట్లతో నిర్మించిన ఎమిలినేటి మాధవరెడ్డి పోలీసు ఆడిటోరియం భవనాన్ని గురువారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. తీవ్ర వాదుల చేతి లో జిల్లాకు చెందిన పోలీసులే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. ఆడిటోరియం నిర్మాణానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. 1992-93లో తాను జిల్లా ఎస్పీ గా పనిచేసినపుడు సాగునీటి వనరులు పెరగలేదని, ఫ్లోరిన్ సమస్య ఉండేదని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత హోంమత్రి మాధవరెడ్డితో ఉన్న అనుబంధంతోనే పోలీసు అమరుల కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకే ఆడిటోరియం నిర్మాణానికి కృషిచేసినట్లు చెప్పారు. ఆడిటోరియానికి ఒక కమిటీని నియమించి వచ్చే ఆదాయం తో అమరుల కుటుంబాలకు తోడ్పాటునందిస్తామన్నారు. వారంలోపు మిర్యాలగూడెంలో మరో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ ఆడిటోరియాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భవనాన్ని పట్టుదలతో పూర్తిచేయడం అభినందనీయమన్నారు. శిథిలావస్థకు చేరిన పోలీస్క్వార్టర్స్ స్థానంలో క్వార్టర్స్ నిర్మించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్రావు, దిలీప్‌కుమార్, ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. డీజీపీకి ఘన సన్మానం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీజీపీ ప్రసాదరావును సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, అమర్‌సింగ్, ఉపేందర్, స్వామి, సోమయ్య ఉన్నారు. బెటాలియన్‌లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నల్లగొండ మండలం అన్నెపర్తి బెటాలియన్‌లో *10 లక్షలతో నిర్మించే రోడ్డుకు డీజీపీ ప్రసాదరావు గురువారం శంకుస్థాపన చేశారు. బెటాలియన్ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బెటాలియన్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశీధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు, కమాండెంట్ బాబూజీ రావు, సీతారాం ఉన్నారు. -
తోలుబొమ్మలాట ఆడిటోరియంలో సిల్లీబ్రాండ్