‘కంటి’లో పుస్తక భాండాగారం... | Eye-like library by MVRDV in China | Sakshi
Sakshi News home page

‘కంటి’లో పుస్తక భాండాగారం...

Published Mon, Aug 22 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

‘కంటి’లో పుస్తక భాండాగారం...

‘కంటి’లో పుస్తక భాండాగారం...

పుస్తకం ప్రపంచాన్ని మన కళ్లముందు ఉంచుతుంది అంటారు. ఈ మాట నెదర్లాండ్స్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ ఎంవీఆర్‌డీవీకి బాగా తెలుసు అనిపిస్తోంది ఫొటోలో ఉన్న బిల్డింగ్‌ను చూస్తే. చైనాలోని తియాన్‌జిన్‌లో ఉన్న ఈ భవనం ఓ లైబ్రరీ కావడం ఒక విశేషమైతే... దూరం నుంచి చూస్తే ఇది ఓ కంటిని తలపించడం మరో వినూత్నమైన విషయం. భవనం మధ్యభాగంలో కనుగుడ్డును పోలిన ఓ గోళాకారపు నిర్మాణం ఉంటుంది. పూర్తిగా అద్దాలతో కట్టిన ఈ గోళాకారం చుట్టూ పిల్లలు, వయసుమళ్లిన వారి కోసం పుస్తకాలు, చదువుకునే ఏర్పాట్లు ఉంటాయి. అద్దాల గోళం లోపలిభాగంలో ఓ ఆడిటోరియం ఉంటుంది.


ఈ 34200 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఈ గ్రంధాలయంలో మొత్తం ఐదంతస్తులు ఉన్నాయి. సెల్లార్ ప్రాంతంలో పుస్తకాలు భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో చిన్నపిల్లలు, వయసుమళ్లిన వారి కోసం ఏర్పాట్లు ంటే... ఒకటి, రెండవ అంతస్తుల్లో రీడింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులు రెండింట్లో కంప్యూటర్, ఆడియో గదులు, కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. జర్మన్ సంస్థ జీఎంపీ నిర్మిస్తున్న 120000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కల్చరల్ సెంటర్‌లో ఒక భాగమీ లైబ్రరీ. బిన్‌హాయి ప్రాంతం ప్రజలకు ఒక మీటింగ్ పాయింట్‌గా రూపొందుతున్న కల్చరల్ సెంటర్‌లో మరో మూడు భవంతులుంటాయి. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement