ఊళ్లలో గ్రంథాలయాలు ఉండటం మనకు తెలుసు. ఊరంత గ్రంథాలయం గురించి విన్నారా?
►నిజంగానే ఇది ఊరంత గ్రంథాలయం. దీని విస్తీర్ణం దాదాపు ఒక చిన్న పట్టణం విస్తీర్ణానికి సమానం. ఇక గ్రంథాలయ భవంతి అగ్రరాజ్యాధినేతల అధికారిక భవంతులను తలదన్నే రీతిలో ఉంటుంది.
►ఇటీవలే ప్రారంభమైన ఈ గ్రంథాలయం చైనాలోని టియాంజిన్ ప్రావిన్స్‌లోని బిన్హాయ్ కల్చరల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. టియాంజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు డచ్ నిర్మాణ సంస్థ ఎంవీఆర్‌డీవీ సహకారంతో ఈ సువిశాల గ్రంథాలయ భవంతిని 34 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు.
► ఇందులో ఉన్న పుస్తకాల సంఖ్య దాదాపు మన దేశ జనాభా అంత ఉంటుంది. చిన్నా పెద్దా అన్ని రకాలూ కలుపుకొని ఈ బృహత్ గ్రంథాలయంలో ఏకంగా 120 కోట్ల పుస్తకాలు కొలువు తీరడం విశేషం.
ఊరంత గ్రంథాలయం
Published Thu, Nov 16 2017 1:11 AM | Last Updated on Thu, Nov 16 2017 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment