
సాక్షి, తిరుపతి: నూతనంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను ఆదివారం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. రూ. 41 కోట్లతో నూతనంగా కచ్చపి ఆడిటోరియంను నిర్మించారు.
ఈ ఆడిటోరియంను ప్రారంభించిన తర్వాత భూమన మాట్లాడుతూ.. కళాక్షేత్రంకు కచ్చపి అని పేరు పెట్టడం వెనుక ఒక చరిత్ర ఉంది. సరస్వతిదేవి వీణలో తీగ పేరు కచ్చపి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లతో మరో తిరుపతిని అభివృద్ధి చేసి చూపించాం. భక్తితో పాటు సాహిత్యం, సంగీతం కార్యక్రమాలతో కచ్చపి కళాక్షేత్రం కళకళలాడుతూ ఉండాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment