రేవాలో రాజ్‌కపూర్ ఆడిటోరియం!
బాలీవుడ్ షోమ్యాన్ రాజ్‌కపూర్ పేరిట మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో ఆడిటోరియం నిర్మాణం జరగనుంది. రాజ్‌కపూర్ జ్ఞాపకార్థం త్వరలోనే ఇక్కడ ప్రపంచస్థాయి ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు మధ్యప్రదేశ్ పౌరసంబంధాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా ప్రకటించారు. రాజ్‌కపూర్ మామగారు అప్పట్లో రేవా రేంజ్ ఐజీగా పనిచేసేవారని ఆయన గుర్తు చేశారు. రాజ్‌కపూర్‌కు ఈ నగరంతో గల అనుబంధానికి గుర్తుగా ఆడిటోరియం నిర్మించనున్నామని చెప్పారు.