
సాక్షి, చెన్నై: చెన్నైలో కళాక్షేత్రలోని ఆడిటోరియం పునరుద్ధరణ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అక్రమాలను గుర్తించింది. ఆ క్షేత్ర మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్‌పై కేసు నమోదు చేసింది. ఆమెతో పాటు అప్పటి నిర్వాహకులు తదితరులపై కేసులు నమోదయ్యాయి. చెన్నై తిరువాన్నియూరులోని ‘కళాక్షేత్ర’ ఫౌండేషన్‌లో 2006–12 మధ్య కాలంలో ఆడిటోరియం పునరుద్ధరణ కోసం కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు దుర్విని యోగమైనట్లు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment