Leela Samson
-
‘పద్మశ్రీ’ లీలాశాంసన్‌పై సీబీఐ కేసు
సాక్షి, చెన్నై: చెన్నైలో కళాక్షేత్రలోని ఆడిటోరియం పునరుద్ధరణ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అక్రమాలను గుర్తించింది. ఆ క్షేత్ర మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్‌పై కేసు నమోదు చేసింది. ఆమెతో పాటు అప్పటి నిర్వాహకులు తదితరులపై కేసులు నమోదయ్యాయి. చెన్నై తిరువాన్నియూరులోని ‘కళాక్షేత్ర’ ఫౌండేషన్‌లో 2006–12 మధ్య కాలంలో ఆడిటోరియం పునరుద్ధరణ కోసం కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు దుర్విని యోగమైనట్లు ఆరోపణలున్నాయి. -
ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ లీలా శాంసన్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలతో ఆమెతోపాటు అప్పటి అధికారులపై సీబీఐ అవినీతి, క్రిమినల్, కుట్ర కేసులు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ సమయంలో అవినీతి జరిగిందనేది ప్రధాన అభియోగం. లీలా శాంసన్ హయాంలో రూ.7.02 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించకుండా కాంట్రాక్టర్లకు నామినేషన్ ప్రాతిపదికన ఎక్కువ రేటుకు కాంట్రాక్టు పనులు అప్పగించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక కమిటీ అధికారిక అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో 2017 లో సంబంధిత మంత్రిత్వ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసిన లీలా శాంసన్‌తో పాటు అప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ మూర్తి, అకౌంట్స్ ఆఫీసర్ రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ వీ శ్రీనివాసన్, కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ (కార్డ్) సంస్థ యజమాని, చెన్నై ఇంజనీర్లపై కేసు నమోదైంది. పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును జనరల్ ఫైనాన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫౌండేషన్ అధికారులు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ కార్డ్‌కు ప్రదానం చేశారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనవసర ఖర్చులతో పాటు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా దాచి పెట్టారని ఆరోపించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. కాగా 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కళాక్షేత్ర డైరెక్టర్‌గా నియమించింది. తరువాత ఆగస్టు 2010లో సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 2011లో బాలీవుడ్ సహా దేశీయ సినిమాలను సెన్సార్ చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు ఛైర్మన్‌గా లీలా శాంసన్ నియమితులయ్యారు. మరోవైపు లీలా శాంసన్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా భావిస్తారు. ప్రియాంకగాంధీకి కొన్నేళ్లపాటు భరతనాట్యం నేర్పించినట్టుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ పాలనలో పదేళ్లపాటు ఆరు కీలక పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి. దీంతో లీలా శాంసనపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు జరిపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. -
'నన్ను నేను చూసుకొని మురిసిపోయా'
హైదరాబాద్: తొలిసారి వెండితెరపై తనను తాను చూసుకోవడం చాలా అనుభూతిని ఇచ్చిందని లీలా సాంసన్ అన్నారు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే కన్మణి తెలుగులో వచ్చిన ఓకే బంగారం చిత్రంలో ఈమె తొలిసారిగా కనిపించారు. 63 సంవత్సరాల వయసులో గతంలో ఎలాంటి అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చిన ఆమె ప్రేక్షకులను అబ్బుర పరిచారు. ఆమె హావబావాలు, మాటలతో అందరితో చప్పట్లు కొట్టించుకున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ భార్యగా నటించిన లీలా సాంమ్సన్ చక్కటి మాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ తొలిసారి మణిరత్నం తనకు ఫోన్ చేసి కథ చెప్పారు. వినగానే నచ్చింది. ఈ చిత్రంలో భవాని అనే పాత్ర చేస్తారా అని అడగగానే ఎందుకు చేయను అని వెంటనే ఒప్పేసుకున్నానని చెప్పారు. స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లిన వారం తర్వాత ఆ పాత్ర మీదే అని చెప్పారన్నారు. తెరమీద తనను తాను చూసుకొని మురిసిపోయానని, మొదటిసారే ప్రకాశ్ రాజ్ లాంటి నటుడితో కలిసి చేయడం చాలా ఆనందనిచ్చిందన్నారు. లీలా సాంమ్సన్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా పనిచేసి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న రాజీనామాల పరంపర
సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా సర్టిఫికేషన్ క్లియరెన్స్ నేపథ్యంలో సెన్సార్ బోర్డులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో బోర్డు సభ్యులు 9 మంది శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకి సమర్పించారు. భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ, టీజీ త్యాగరాజన్, మమంగ్ దాయ్, సుబ్రాగుప్త, రాజీవ్ మసంద్లతో పాటు మరో ఇద్దరు సభ్యులు రాజీనామా లేఖలు పంపారు. బోర్డు చైర్మన్ లీలా శాంసన్ శుక్రవారం తన రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా నటించిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్'పై ఎటువంటి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, అధికారం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తన లేఖలో వివరించారు. మంత్రిత్వ శాఖ చోక్యం, అవినీతి మూలంగానే రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చైర్మన్, సభ్యుల వాదన. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి ఎటువంటి నిధులు కానీ, మద్ధతు ఉండేది కాదని లేఖలలో పేర్కొన్నారు. ఏ ఒక్క నిర్ణయం తమకు అనుకూలంగా తీసుకోలేదని ఆ శాఖ తీరుని వెల్లడించారు. కాగా ఈ పరిణామాలపై రాజవర్థన్ సింగ్ రాథోడ్ స్పందిస్తూ సినిమాల సర్టిఫికేషన్ విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని, ఆవిషయాలకు తాము ఎప్పుడూ దూరంగా ఉంటామని అన్నారు. -
బ్రేక్‌ఫాస్ట్ షో : MSG సినిమా వివాదమేంటీ ?
-
సెన్సార్ బోర్డు వర్సెస్ కేంద్రం!
‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై ముదిరిన వివాదం సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ రాజీనామా న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రం విడుదల వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ దాని విడుదలకు అనుమతిని కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎఫ్‌సీఏటీ) మాత్రం ఆ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడం దుమారం రేపింది. దీనిపై కలత చెందిన సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ గురువారం రాజీనామా చేయగా శుక్రవారం శాంసన్‌కు మద్దతుగా సెన్సార్ బోర్డు సభ్యురాలు ఐరా భాస్కర్ రాజీనామా చేశారు. కేంద్రం పరిధిలోని ఎఫ్‌సీఏటీ ఈ చిత్రం విడుదలకు అనుమతివ్వడం సెన్సార్ బోర్డును ఎగతాళి చేయడమేనని శాంసన్ అన్నారు. బోర్డులో ఇటీవలి కాలంలో కొన్ని కేసుల్లో ప్రభుత్వ జోక్యం, ఒత్తిళ్లు, ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి వంటి కారణాల వల్ల సెన్సార్ బోర్డు చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు శాంసన్ చెప్పారు. అయితే శాంసన్ ఆరోపణలను సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తోసిపుచ్చారు. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం లేదని, ప్రభుత్వ జోక్యం ఉందంటున్న శాంసన్ అందుకు ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు ఈ వివాదం నడుమ ఈ చిత్రం విడుదల శుక్రవారానికి బదులు ఆదివారానికి వాయిదా పడింది. ఈ చిత్రంలో రామ్ రహీమ్ సింగ్ తనను తాను దేవుడిగా, సిక్కుల గురువుగా చెప్పుకున్నాడంటూ సిక్కు సంఘాలు ఆందోళనకు దిగడంతో పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రహీమ్ సింగ్ శుక్రవారం గుర్గావ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన చిత్రం ఏ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదన్నారు. కాగా, సెన్సార్ బోర్డులోని మరో సభ్యురాలు నందిని సర్దేశాయ్ మాట్లాడుతూ సినిమా విడుదలపై 15-30 రోజుల్లో నిర్ణయం తీసుకునే ఎఫ్‌సీఏటీ కేవలం 24 గంటల వ్యవధిలోనే ‘మెసంజర్ ఆఫ్ గాడ్ ’ విడుదలకు అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. -
'పీకే సినిమా చూడొద్దని చెప్పండి'
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు లీలా సామ్సన్ సమర్థించుకున్నారు. తమ పని తాము చేశామని పేర్కొన్నారు. పీకే సినిమా చూడొద్దని రాజకీయ పార్టీలు, సైద్ధాంతిక సంస్థలు తమ మద్దతుదారులకు చెప్పాలని ఆమె సలహాయిచ్చారు. పీకే సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మత సంస్థలు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన గురించి అడిగినప్పుడు ఆమె ఈవిధంగా స్పందించారు. అయితే 'పీకే' సినిమా ద్వారా ఏ మతాన్ని అగౌరవపరచలేదని ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ వివరణ ఇచ్చారు. ఏ మతాన్ని కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. -
'పీకే మూవీ నుంచి ఎటువంటి సీన్స్ తొలగించం'
ఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని తక్షణమే తొలగించాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు స్పందించింది. పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 19వ తేదీన విడుదలైన 'పీకే' చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. -
బిస్మిల్లా యువపురస్కార్ ప్రదానం
కూచిపూడి: కృష్ణాజిల్లాకు చెందిన యువ కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం సత్యనరసింహశాస్త్రి ‘ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ 2012’ అందుకున్నారు. శనివారం రాత్రి త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఈ అవార్డును ప్రదానం చేశా రు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డు కింద రూ.25 వేల నగదు, రజత పతకం, శాలువాను అందజేసింది. కూచిపూడిలోని ప్రముఖ నాట్యాచార్యుడు కళారత్న వేదాంతం రాధేశ్యాం కుమారుడైన నరసింహశాస్త్రి ప్రస్తుతం హైదరాబాద్‌లో కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ లీలా శ్యాంసన్ కూడా పాల్గొన్నారు. శాస్త్రికి అవార్డు రావడంపై కళాకారులు పసుమర్తి కేశవప్రసాద్, డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి, వై.కె.డి.ప్రసాదరావు, రవిబాలకృష్ణ హర్షం ప్రకటించారు.