'నన్ను నేను చూసుకొని మురిసిపోయా' | it was thrilling to be on the sets | Sakshi
Sakshi News home page

'నన్ను నేను చూసుకొని మురిసిపోయా'

Published Tue, May 5 2015 1:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

'నన్ను నేను చూసుకొని మురిసిపోయా'

'నన్ను నేను చూసుకొని మురిసిపోయా'

హైదరాబాద్: తొలిసారి వెండితెరపై తనను తాను చూసుకోవడం చాలా అనుభూతిని ఇచ్చిందని లీలా సాంసన్ అన్నారు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే కన్మణి తెలుగులో వచ్చిన ఓకే బంగారం చిత్రంలో ఈమె తొలిసారిగా కనిపించారు. 63 సంవత్సరాల వయసులో గతంలో ఎలాంటి అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చిన ఆమె ప్రేక్షకులను అబ్బుర పరిచారు. ఆమె హావబావాలు, మాటలతో అందరితో చప్పట్లు కొట్టించుకున్నారు.

ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ భార్యగా నటించిన లీలా సాంమ్సన్ చక్కటి మాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ తొలిసారి మణిరత్నం తనకు ఫోన్ చేసి కథ చెప్పారు. వినగానే నచ్చింది. ఈ చిత్రంలో భవాని అనే పాత్ర చేస్తారా అని అడగగానే ఎందుకు చేయను అని వెంటనే ఒప్పేసుకున్నానని చెప్పారు. స్క్రీన్ టెస్ట్కు వెళ్లిన వారం తర్వాత ఆ పాత్ర మీదే అని చెప్పారన్నారు. తెరమీద తనను తాను చూసుకొని మురిసిపోయానని, మొదటిసారే ప్రకాశ్ రాజ్ లాంటి నటుడితో కలిసి చేయడం చాలా ఆనందనిచ్చిందన్నారు.  లీలా సాంమ్సన్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా పనిచేసి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement