థ్రిల్ కోసం ఎంత పని చేశాడు..! | Bored man slashes womans back for thrill | Sakshi
Sakshi News home page

థ్రిల్ కోసం ఎంత పని చేశాడు..!

Published Fri, Jul 8 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

థ్రిల్ కోసం ఎంత పని చేశాడు..!

థ్రిల్ కోసం ఎంత పని చేశాడు..!

బీజింగ్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో ఆమె వీపుపై పెద్ద గాయం చేశాడు. ఇదే తరహాలో మరో ముగ్గురిపై కూడా దాడికి పాల్పడిన వ్యక్తిని చివరికి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు చెప్పిన సమాధానం విని షాక్ తిన్నారు. బోర్ కొట్టడంతో.. కేవలం థ్రిల్ కోసం ఈ పని చేసినట్లు వెల్లడించాడు.

నైరుతి చైనాలోని షోంగ్డూ పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని.. మోటార్ సైకిల్పై వేగంగా వచ్చి, పదునైన కత్తితో దుండగుడు దాడిచేసే వాడు. ఒకరికి వీపుపై 32 కుట్లు పడేలా దారుణంగా చీల్చాడు. మరో ఇద్దరిపై కూడా ఇదే తరహాలో దాడికి పాల్పడటంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేసి.. 31 ఏళ్ల జంగ్ను పట్టుకున్నారు. అతడు కేవలం బోర్ కొట్టడంతో.. థ్రిల్ కోసం ఇలా చేశానని విచారణలో చెప్పడంపై సోషల్ మీడియాలో అతడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement