June 20 Gold falls as dollar index rebounds; check details - Sakshi
Sakshi News home page

డాలరు పైపైకి దిగొస్తున్న పసిడి: మరింత తగ్గుతుందా?

Published Tue, Jun 20 2023 3:44 PM | Last Updated on Tue, Jun 20 2023 4:27 PM

June 20 Gold falls as dollar index rebounds check details - Sakshi

సాక్షి, ముంబై: బులియన్‌ మార్కెట్లో గత రెండు రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ముఖ్యంగా డాలరు పుంజుకోవడంతో బంగారం మరింత నష్టపోయాయి.  డాలరు కనిష్ట స్థాయిలనుంచిపుంజుకోవడంతో బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

ఆషాడం  కావడంతో పసిడి మెల్లగా దిగిస్తోంది. కొనుగోళ్లు స్తబ్దుగా ఉండటంతో గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు 1000 రూపాయలు తగ్గింది.  దేశీయంగా  మంగళవారం  బంగారం ధరలు 22  క్యారెట్  గ్రాము ధర  రూ. 5,500 ఉండగా, 24 క్యారెట్ ధర గ్రాముకు రూ 6,000గా పలుకుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,00 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. (వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌: వాళ్ల నోరు నొక్కేయండి అంతే!)

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,210గా చేరుకుంది. మరోవైపు ఇటీవల భారీగా క్షీణించిన కిలోవెండి కొద్దిగా బౌన్స్‌ బ్యాక్‌ అయింది.  కిలో వెండి 500 రూపాయిలు ఎగిసి  73,500 వద్ద కొనసాగుతోంది.  హైదరాబాద్‌లో మాత్రం రూ. 78,600 పలుకుతోంది.  (50 ఏళ్ల అనుబంధం: నందన్‌ నీలేకని కీలక నిర్ణయం)

ఎంసీఎక్స్‌ ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల రూ. 59,176 వద్ద  స్వల్ప నష్టంతో ఉండగా, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 113  క్షీణించి రూ. 72,313 వద్ద ఉంది

గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్‌ వెండి 24.02 డాలర్ల వద్ద ,బంగారం ఔన్సు ధర1,954 డాలర్ల వద్ద ఉంది.  కాగా డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయి నుండి పుంజుకుని ప్రస్తుతం 101.96 వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 0.12శాతం పెరిగింది.ఇది బంగారం ధరలను  ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 14 పైసలు  క్షీణించి 82.08 వద్ద ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement