slashes
-
డాలరు పైపైకి దిగొస్తున్న పసిడి: మరింత తగ్గుతుందా?
సాక్షి, ముంబై: బులియన్ మార్కెట్లో గత రెండు రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ముఖ్యంగా డాలరు పుంజుకోవడంతో బంగారం మరింత నష్టపోయాయి. డాలరు కనిష్ట స్థాయిలనుంచిపుంజుకోవడంతో బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఆషాడం కావడంతో పసిడి మెల్లగా దిగిస్తోంది. కొనుగోళ్లు స్తబ్దుగా ఉండటంతో గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు 1000 రూపాయలు తగ్గింది. దేశీయంగా మంగళవారం బంగారం ధరలు 22 క్యారెట్ గ్రాము ధర రూ. 5,500 ఉండగా, 24 క్యారెట్ ధర గ్రాముకు రూ 6,000గా పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,00 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. (వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: వాళ్ల నోరు నొక్కేయండి అంతే!) ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,210గా చేరుకుంది. మరోవైపు ఇటీవల భారీగా క్షీణించిన కిలోవెండి కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది. కిలో వెండి 500 రూపాయిలు ఎగిసి 73,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాత్రం రూ. 78,600 పలుకుతోంది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) ఎంసీఎక్స్ ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల రూ. 59,176 వద్ద స్వల్ప నష్టంతో ఉండగా, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 113 క్షీణించి రూ. 72,313 వద్ద ఉంది గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి 24.02 డాలర్ల వద్ద ,బంగారం ఔన్సు ధర1,954 డాలర్ల వద్ద ఉంది. కాగా డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయి నుండి పుంజుకుని ప్రస్తుతం 101.96 వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 0.12శాతం పెరిగింది.ఇది బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో 14 పైసలు క్షీణించి 82.08 వద్ద ఉంది. -
మహిళా జర్నలిస్ట్‌పై కంగనా అసహనం.. ఎందుకంటే ?
Kangana Ranaut Lashes Out A Journalist And Said Sit Down: బాలీవుడ్ బ్యూటీ, డేరింగ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అభిప్రాయాలు, కామెంట్లతో వైరల్‌గా మారుతుంది. ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఓ మహిళా విలేకరిపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా హీరోయిన్గా, కాంట్రవర్సీ క్వీన్‌గా అలరించిన కంగనా తాజాగా హోస్ట్‌గా వ్యవహరించనుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించనున్న రియాల్టీ షో 'లాక్ అప్'కు వ్యాఖ్యతగా సందడి చేయనుంది కంగనా. ఈ షో మరికొన్ని రోజుల్లో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల వేదికగా ప్రసారం కానుంది. అయితే ఈ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం (జనవరి 3) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంగనా జర్నలిస్ట్‌ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఒక లేడీ జర్నలిస్ట్ 'మేడమ్, ఈ మధ్య కాలంలో మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి ప్రవర్తనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి కామెంట్స్‌తో టార్గెట్ చేయబడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటీ ?' అని అడిగారు. దీంతో 'చూడండి, ఎవరైతే తమను రక్షించుకోలేరో వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమె తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు (దీపికా పదుకొణె) ఆ సామర్థ్యం ఉంది. అయితే ఆమె సినిమాను నేను ఇక్కడ ప్రమోట్ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి.' అంటూ అసహనంగా సమాధానం ఇచ్చింది కంగనా రనౌత్. -
భారత వృద్ధిరేటు : ఐఎంఎఫ్ కోత
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనాలో మరోసారి కోత పెట్టింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2020 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.1 శాతంగా ఉండనుందని తెలిపింది. దేశీయ డిమాండ్ ఊహించిన దానికంటే బలహీనమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది. జూలైలో 7.2 శాతంగా ఉన్న అంచనాను 20 బిపిఎస్ పాయింట్లు (7 శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం, ఆర్థిక ఉద్దీపన, వాణిజ్యయుద్ధం, డీగ్లోబలైజేషన్పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మాంద్యం ఏర్పడిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అయితే భారతదేశంలో ద్రవ్య విధాన సడలింపు, ఇటీవలి కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపులు వృద్ధికి తోడ్పడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే గ్రామీణ వినియోగానికి తోడ్పడే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వృద్ధికి తోడ్పడతాయని చెప్పింది. -
ఎయిర్టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కొత్త చందాదారులకోసం ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం తాజాగా హెచ్డి, ఎస్డి సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించింది. డీటీహెచ్ ఆపరేటర్లలో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొత్త వినియోగదారులను ఆకర్షించనుంది. గత త్రైమాసికంలో నాలుగు లక్షలమంది ఖాతాదారులను తన ఖాతాలో చేర్చుకున్న భారతి ఎయిర్టెల్ ఇపుడు సెట్-టాప్ బాక్సల ధరలను రూ. 500 వరకు తగ్గించింది. ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు ఇప్పుడు రూ .1300 వద్ద హెచ్డి సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చు, ఇప్పటివరకు దీని ధర రూ .1800గా ఉంది. ఈ తగ్గింపుతో హెచ్డి బాక్స్ రూ.1,300 ధరతో అందిస్తుండగా, ఎస్డీ సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1100ల ధర వద్ద అందిస్తోంది. కాగా డీటీహెచ్ ఆపరేటర్లలో మిగిలిన వారి ధరలతో పోల్చితే టాటా స్కై హెచ్డి సెట్-టాప్ బాక్స్ధర రూ .1499, ఎస్డి సెట్-టాప్ బాక్స్ ధర రూ .1399గా ఉంది. -
ఇక తగ్గింపు ధరల్లో హైఎండ్ బైక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దిగుమతి సుంకం భారీ తగ్గింపుతో అంతర్జాతీయ బైక్‌లు చవకగా భారతీయులకు లభించ నున్నాయి. హర్లే డేవిడ్సన్, ట్రైయింప్ సహా, ఇతర హై ఎండ్ బ్రాండ్ల మోటార్ సైకిళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఫిబ్రవరి 12 న జారీ చేసిన నోటిఫికేషన ప్రకారం పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకూ 800 సీసీ అంతకంటే తక్కువ ఇంజీన్ కెపాసిటీ బైక్‌లపై 60శాతం దిగుమతి సుంకం ఉండగా, 800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై దిగుమతి సుంకం 75శాతంగా ఉండేది. పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం రేటు ఈ రెండు రకాల మోడళ్లపై 50 శాతానికి తగ్గించడంతో దేశంలో వీటి ధరలు తగ్గుముఖం పడతాయని ఈవై పార్టనర్ అభిషేక్ జైన్ చెప్పారు. సీబీఎఫ్సీ నోటిఫికేషన్ ప్రకారం, ప్రీ ఎసంబుల్డ్ ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా ట్రాన్స్మిషన్ మెకానిజంపై పూర్తిగా దిగుమతి చేసుకున్న (సీకేడీ) వస్తు సామగ్రిపై, దిగుమతి సుంకం 25 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 30శాతంగా ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా లో భాగంగా స్థానిక తయరాదారులకు ప్రోత్సహించేందుకు ఎసంబుల్డ్ కాని ఇంజిన్, గేర్ బాక్స్, ట్రాన్స్మిషన్ మెకానిజం దిగుమతిపై 15 శాతం వరకు కస్టమ్స్ సుంకం పెంచివంది. ఇది ఇప్పటివరకు 10 శాతంగా ఉంది. తద్వారా ఆటోమొబైల్ సహాయక పరిశ్రమలను రక్షించే ఒక పెద్ద సందేశాన్ని ప్రభుత్వం పంపిందనీ, గొప్ప తయారీ కేంద్రంగా ఇండియాకు ప్రాధాన్యత నిచ్చేలా విధానాన్ని రూపొందించిందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అనూప్ కాల్వాత్ వ్యాఖ్యానించారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోత
న్యూఢిల్లీ: సేవింగ్స్ వడ్డీరేట్లపై కోత పెట్టిన బ్యాంకుల జాబితాలోకి తాజాగా మరో బ్యాంక్ కూడా చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు నగదు నిల్వల వడ్డీరేటుపై 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది. పొదుపు ఖాతాల్లో రూ. 50లక్షల కంటే తక్కువ ఉన్న నిల్వలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేడు 3.5శాతంగా ఉండనుంది. ‘పొదుపు ఖాతాలపై బ్యాంక్ రెండంచెల విధానాన్ని అమలుచేయనుంది. దీని ప్రకారం రూ. 50 లక్షల లోపు 3.5శాతంగానూ, రూ. 50లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే.. యధావిధిగా 4శాతం వడ్డీరేటు ఉంటుంది’ అని బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నేటి నుంచే ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని చెప్పింది. కాగా జూలై 31 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను కోతపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఇదే బాటలను అనుసరించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
రెండు లక్షలు ధర తగ్గిన నిస్సాన్ సన్నీ
న్యూఢిల్లీ: జపనీస్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ తన లేటెస్ట్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించింది. మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరను గురువారం భారత మార్కెట్లో దాదాపు రెండు లక్షల మేర ధర తగ్గించింది. 2017 లో లాంచ్ అయిన సన్నీ మోడల్ ధరలో రూ.1.99 లక్షల రూపాయల మేర తగ్గింపు అనంతరం దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలనుంచి రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అందుబాటులోకి తీసుకొచ్చినంది. ఉ త్పత్తిఖర్చులు తగ్గిన కారణంగా ఈ తగ్గింపు అని నిస్సాన్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ధరల ప్రకారం, నిస్సాన్ సన్నీ పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు రూ 6.99 లక్షలు, టాప్-ఎండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ 8.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా, డీజిల్ మోడల్‌పై రూ.1.31 లక్షల కోత అనంతరం ఇప్పుడు రూ.7.49 లక్షల ధరకే ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ పై రూ.94వేల తగ్గింపు అనంతరం రూ.8.99 లక్షలకే విక్రయించనుంది. గత ఏడాది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మైక్రా ధరను రూ.54వేలు తగ్గించింది. లోకల్ ప్రొడక్షన్ కారణంగా ఈ తగ్గింపు ధరలను ప్రకటించినట్టు నిస్సాన్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు. ఉత్పత్తి ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని భావించినట్టు చెప్పారు. అందుకే తమ పాపులర్ అండ్ ప్రీమియం మోడల్ సెడాన్‌ను తక్కువ ధరల్లో అందించనున్నట్టు తెలిపారు. -
చిన్న పొదుపు దారుల ఆశలపై నీళ్లు
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపుదారులకు తీరని నిరాశను మిగిల్చింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) , ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. పీపీఎఫ్ సహా, చిన్న పొదుపు ఖాతాలపై 0.1 శాతం వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం వీటిపై ప్రస్తుత వడ్డీరేటు 8 శాతం, రేపటినుంచి 7.9శాతంగా ఉండనుంది. పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా, ఏప్రిల్ 1, 2017 నుంచి ప్రారంభమయ్యే 2016-17 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్ల తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆ దేశాలు అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునే ఖాతాదారుల నడ్డి విరిచింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయబ్యాంకులు కూ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టే అవకశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రుణాల జారీ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను పెంచుకునేందుకు సేవింగ్స్ ఖాతాలనిల్వలపై వడ్డీ రేట్ల కోత తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఐడియా మరో బంపర్ ఆఫర్...
న్యూఢిల్లీః ఐడియా నెట్వర్క్ వినియోగదారులకు వారంలోనే వరుసగా రెండోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న 4జి, 3జి మొబైట్ ఇంటర్నెట్ ప్యాక్ ధరలపై 67 శాతం తగ్గింపును ప్రకటించింది. తన పోటీదారులు భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తో పోల్చితే భారీగా తగ్గింపును ఐడియా ప్రకటించింది. రెండు రోజుల క్రితం 1జిబి కన్నా తక్కువ ప్యాక్స్ పై ధరలో 45 శాతం తగ్గింపు విధిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ... తాజాగా అత్యధికంగా ఇంటర్నెట్ వాడే 2జిబి నుంచి 10 జిబి ప్యాక్స్ కలిగిన వినియోగదారులకు 67 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు ఐడియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్ 3జి, 4జి కస్టమర్లకోసం భారతి ఎయిర్ టెల్ 67 శాతం ధరలు తగ్గించడంతో.. ఐడియా ఒకే వారంలో రెండోసారి ధరల తగ్గింపును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐడియా 10 జిబి 4జి, 3జి ఇంటర్నెట్ ప్యాక్స్ ను కేవలం 990 రూయాయలకే అందిస్తోంది. అలాగే ఇంతకు ముందు 449 రూపాయలుండే 2జిబి డేటాను 349 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుత 67 శాతం భారీ తగ్గింపులతో ఐడియా కస్టమర్లు ఇంతకు ముందు 3జి డేటా ధరలకు దగ్గరగా 5జిబి 4జి, 3జి డేటా ప్యాక్ లకు 649 రూపాయలకే పొందే అవకాశం లభిస్తోంది. ఈ నూతన టారిఫ్ ను ప్రీ పెయిడ్ వినియోగదారులు 4జి, 3జి ప్రొవైడర్లద్వారా వెంటనే పొందవచ్చని ఐడియా వెల్లడించింది. రిలయన్స్ జియో అతి తక్కువ రేటుకు ఇంటర్నెట్ ప్యాక్స్ ను అందిస్తుండటంతో మిగిలిన అన్ని టెలికాం కంపెనీలు ధరలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
థ్రిల్ కోసం ఎంత పని చేశాడు..!
బీజింగ్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో ఆమె వీపుపై పెద్ద గాయం చేశాడు. ఇదే తరహాలో మరో ముగ్గురిపై కూడా దాడికి పాల్పడిన వ్యక్తిని చివరికి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు చెప్పిన సమాధానం విని షాక్ తిన్నారు. బోర్ కొట్టడంతో.. కేవలం థ్రిల్ కోసం ఈ పని చేసినట్లు వెల్లడించాడు. నైరుతి చైనాలోని షోంగ్డూ పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని.. మోటార్ సైకిల్‌పై వేగంగా వచ్చి, పదునైన కత్తితో దుండగుడు దాడిచేసే వాడు. ఒకరికి వీపుపై 32 కుట్లు పడేలా దారుణంగా చీల్చాడు. మరో ఇద్దరిపై కూడా ఇదే తరహాలో దాడికి పాల్పడటంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేసి.. 31 ఏళ్ల జంగ్‌ను పట్టుకున్నారు. అతడు కేవలం బోర్ కొట్టడంతో.. థ్రిల్ కోసం ఇలా చేశానని విచారణలో చెప్పడంపై సోషల్ మీడియాలో అతడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. -
వీసా ఫీజులో 80 శాతం కోత
భారత్ నుంచే వచ్చే భారీ పర్యాటక ఆదాయంపై కన్నేసిన మరో గల్ఫ్ దేశం బహ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ఆదాయాన్ని కొల్లగొట్టే వ్యూహంలో భాగంగా బహ్రెయిన్ సందర్శించాలనుకునే పర్యాటకుల వీసా ఫీజులో భారీ కోత విధించింది. 80 శాతం వీసా ఫీజును తగ్గించినట్టు బహ్రెయిన్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరాడ్ బచ్చర్ ప్రకటించారు. ప్రస్తుతం 25 దినార్లుగా ఉన్న ఈ ఫీజును కేవలం 5 దినార్లకు పరిమితం చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకూ రూ. 4,446 లుగా ఉండగా, ప్రస్తుతం అయిదు దినార్లు అంటే కేవలం 889 రూ. మాత్రమే. 25 దినార్లుగా ఉన్న ఈ ఫీజును కేవలం 5 దినార్లకు పరిమితం చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకూ రూ. 4,446 లుగా ఉన్న ఈ ఫీజు, ప్రస్తుతం అయిదు దినార్లు అంటే కేవలం రూ. 889 మాత్రమే. అలాగే ఇండియానుంచి తక్కువ సమయంలోతమ దేశానికి చేరేలా చర్యలు చేపడుతున్నామని జెరాడ్ చెప్పారు. ముంబై ఢిల్లీ మధ్య ప్రయాణంకంటే తక్కువగా, సమానంగా ముంబై, బహ్రెయిన్ ప్రయాణం ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఒక వారంలో 75 విమాన సర్వీసులున్నాయని.. భారతదేశం మధ్య అద్భుతమైన వాయుమార్గ నిర్మాణ లక్ష్యంతో ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో విమానాశ్రయ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని అది పూర్తయితే ప్రస్తుతం తొమ్మిది మిలియన్లుగా ఉన్న పర్యాటకుల సంఖ్య 14 మిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. బిలియన్ల డాలర్ల ఆదాయంపై గురిపెట్టిన బహ్రెయిన్ భారతీయ పర్యాటకును ఆకర్షించేందుకు వీలుగా భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఇండియాలో మొట్టమొదటి బహ్రెయిన్ పర్యాటక కార్యాలయాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనుంది. దీన్ని బట్టే దేశం నుంచి బహ్రెయిన్ ఆశిస్తున్న పర్యాటక రంగం డిమాండ్ ను మనం అంచనా వేయవచ్చు. 2015 ఆర్థిక సంవత్సరంలో 69కోట్లను వెచ్చించగా, అదే ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 4 వేల కోట్లు ఖర్చుపెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. కాగా గల్ఫ్ దేశం అనగానే విలాసవంతమైన అరబ్ షేకులు..ఆయిల్ నిక్షేపాలు.. ఉపాధికోసం పరుగులు పెట్టే కార్మికులు.. వేలమంది పర్యాటకులు మనకు గుర్తుకు వస్తారు. గల్ఫ్ దేశాలకు కువైట్, బహ్రయిన్, ఇరాక్, ఒమన్,ఖతర్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఇండియానుంచి వచ్చే పర్యాటక ఆదాయంకూడా భారీగానే ఉంది. దీంట్లో అగ్ర భాగం దుబాయ్ దే. ఆ తరువాత, ఓమన్, అబుదాభి నిలుస్తాయి.